న్యాయం కోసం వెళితే.. చితక్కొట్టిన పోలీస్ బాస్..
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తనకు న్యాయం చేయమని వస్తే.. న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయంగా ప్రవర్తించిన ఘటన ఎటపాక మండలం కుసుమన పల్లిలో చోటుచేసుకుంది. గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న ఇరప కృష్ణవేణి అనే మహిళ తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త నుంచి ప్రాణ హాని ఉందని.. తనని తన కొడుకుని కాపాడాలని కోరింది. అయితే ఫిర్యాదు […]

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తనకు న్యాయం చేయమని వస్తే.. న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయంగా ప్రవర్తించిన ఘటన ఎటపాక మండలం కుసుమన పల్లిలో చోటుచేసుకుంది. గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న ఇరప కృష్ణవేణి అనే మహిళ తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త నుంచి ప్రాణ హాని ఉందని.. తనని తన కొడుకుని కాపాడాలని కోరింది. అయితే ఫిర్యాదు చేసి మూడు నెలలు గడుస్తున్నా స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
దీంతో స్థానిక ఎస్సై చినబాబు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలితో స్టేషన్ కి వచ్చిన.. ఆమె సోదరుడు రమేష్‌ని గదిలో పెట్టి చావబాదాడు. ఎస్సైకి ఫిర్యాదు చేశారా అంటూ విరుచుకుపడ్డాడు. తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఎస్సై.. తోడుగా వెళ్లిన బాధితురాలి సోదరుడి పై దాడి చేయడం అన్యాయం అని ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం చేయాల్సిన పోలీసులే దాడికి పాల్పడితే ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఎస్సై ఉన్నతాధికారి ఫిర్యాదు చేస్తే ఏ పాపం ఎరుగని బాధితుల బంధువులను చితకబాదడం దుర్మార్గం అంటున్నారు. తక్షణమే ఎస్సై పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.




