కొవిడ్ సెంటర్ విధుల్లో ఉన్న మహిళా పోలీసుపై కానిస్టేబుల్ లైంగికదాడి
జంషెడ్‌పూర్ లో దారుణం జరిగింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ దుర్మార్గుడు తన సహచర ఉద్యోగిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదికూడా కొవిడ్ కేంద్రంలో విధినిర్వహణలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ తన తోటి మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేశాడు.

జంషెడ్‌పూర్ లో దారుణం జరిగింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ దుర్మార్గుడు తన సహచర ఉద్యోగిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదికూడా కొవిడ్ కేంద్రంలో విధినిర్వహణలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ తన తోటి మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేశాడు. జంషెడ్‌పూర్ నగరంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో సిద్‌గోరా ప్రొఫెషనల్ కళాశాలలో ప్రత్యేక కొవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కొవిడ్ కేంద్రంలో పోలీసు కానిస్టేబుల్ అనిల్ కుమార్, ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి విధులు నిర్వహిస్తున్నారు. కొవిడ్ కేంద్రంలోని భవనంలో పై అంతస్తులో కరోనా వైరస్ ప్రభావం ఉండదని, అక్కడ సురక్షితమని చెప్పి మహిళా కానిస్టేబుల్ ను పై గదిలోకి తీసుకువెళ్లిన కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో కేకలు వేయకుండా నోరు మూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
జరిగిన ఘటనపై బాధిత మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితుడు కానిస్టేబుల్ అనిల్ కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 376 (2) ప్రకారం కేసు నమోదు చేశామని పోలీసుఅధికారి మనోజ్ ఠాకూర్ చెప్పారు. బాధిత మహిళా కానిస్టేబుల్ భర్త విధి నిర్వహణలో మరణించడంతో కారుణ్య నియామకం కింద ఆమెకు ఉద్యోగం లభించింది.




