Hyderabad: ఆ చిన్నారికి అమ్మ చీరే ఉరైంది.. ఊయలలో ఊగుతుండగా మెడకు బిగుసుకొని..

|

May 29, 2022 | 10:21 AM

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన ప్రసన్నజ్యోతి, రాజేష్‌ దంపతులు లాలాపేటలో నివాసం ఉంటున్నారు.

Hyderabad: ఆ చిన్నారికి అమ్మ చీరే ఉరైంది.. ఊయలలో ఊగుతుండగా మెడకు బిగుసుకొని..
Crime News
Follow us on

Hyderabad Crime News: చీరతో కట్టిన ఊయల.. చిన్నారికి మృత్యు పాశంగా మారి ప్రాణం తీసింది. ఊయల ఊగుతూ చిన్నారి మృతిచెందిన ఘటన హైదరాబాద్‌ నగర పరిధిలోని లాలాగూడలో చోటుచేసుకుంది. చిన్నారి మరణించడంతో బతుకుదెరువుకు నగరానికి వచ్చిన దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. లాలాగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన ప్రసన్నజ్యోతి, రాజేష్‌ దంపతులు లాలాపేటలో నివాసం ఉంటున్నారు. ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

రాజేష్ డ్రైవర్‌గా పని చేస్తుండగా.. ప్రసన్న జ్యోతి కూలీ పనులకు వెళుతుంది. శనివారం తల్లి పనికి వెళ్లగా పెద్ద కుమార్తె ఎలీనా(9) తన చెల్లెళ్లతో కలిసి ఆడుకుంటోంది. అయితే.. ఇంట్లో కొక్కానికి చీరతో కట్టిన ఊయలలో ఎలీనా ఊగుతుండగా అది ఒక్కసారిగా మెడకు చుట్టుకుంది. అనంతరం ఒక్కసారిగా బిగుసుకుపోవటంతో ఆవహ ఊపిరాడక మృతి చెందింది. తన అక్క మాట్లాడటం లేదని గమనించిన చెల్లెళ్లు.. సమీపంలో ఉన్న బంధువులకు చెప్పారు.

దీంతో ఇరుగుపొరుగునున్న వారు వచ్చి చూడగా.. అప్పటికే ఆమె చనిపోయిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..