బంగారం పేరుతో ఘరానా మోసం..

రంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. ప్రజలకు బంగారంపై ఉన్న మక్కువను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కేటుగాడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాల్లో ..

బంగారం పేరుతో ఘరానా మోసం..
Follow us

|

Updated on: Jul 09, 2020 | 12:23 PM

రంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. ప్రజలకు బంగారంపై ఉన్న మక్కువను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కేటుగాడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాల్లో తనకు బంగారు కడ్డీలు దొరికాయంటూ.. నిందితుడు డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని మనోహరాబాద్ మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పూర్తి వివరాలు పరిశీలించగా…

జిల్లాలోని మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన వ్యక్తికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తొలుత తానొక జేసీబీ డ్రైవర్‌నని, ఎక్కడైన డ్రైవర్ ఉద్యోగం ఉంటే ఇప్పించాలని కోరాడు. తమ స్వస్థలం హర్యానా రాష్ట్రంగా చెప్పాడు. అలా గత మూడు నెలలుగా సదరు వ్యక్తి తనకు ఫోన్ చేస్తూనే ఉన్నాడని చెప్పాడు. చివరకు ఓ రోజు అలాగే ఫోన్‌ చేసి తనకు ఓ పాత ఇంటిలో జేసీబీతో పనులు చేస్తుంటే బంగారం బిస్కెట్స్‌ దొరికాయని, అవి తీసుకుని తనకు అర్జెంట్‌గా డబ్బుల అవసరం ఉందని చెప్పాడు. తనకు దొరికిన బంగారం అమ్ముతానని బంగారం ఫొటోలను బాధితుడి ఫోన్‌కు పంపించాడు. అది నమ్మిన బాధితుడు.. విడతల వారిగా ఆన్‌లైన్‌లో రూ.లక్షా 28 వేలు పంపాడు. కాగా ఇంకా డబ్బులు కావాలని ఫోన్‌ చేయడంతో, అనుమానం వచ్చి మిగతా డబ్బులు బంగారం చూపితేనే ఇస్తానని చెప్పి అతడిని చాకచక్యంగా కాళ్ళకల్‌ గ్రామంలో బంగారమ్మ దేవాలయం వద్దకు రప్పించాడు.

బంగారం బిస్కెట్స్‌ మాదిరిగా ఉన్న బిల్లలు ఇవ్వగా అనుమానం వచ్చి వాటిని చెక్‌ చేయించగా అది బంగారం కాదని నకిలీదని తెలింది. వెంటనే అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్ని విచారణ చేపట్టారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..