డ్రగ్స్ కేసులో మరో నలుగురి అరెస్ట్

ఏపీలో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుండగా...మరోవైపు డ్రగ్స్ మాఫియా బుసలు కొడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. భీమవరంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో..

డ్రగ్స్ కేసులో మరో నలుగురి అరెస్ట్
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 09, 2020 | 1:05 PM

ఏపీలో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుండగా…మరోవైపు డ్రగ్స్ మాఫియా బుసలు కొడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. భీమవరంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ వివరాలు వెల్లడించారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డ్రగ్స్​ కేసులో మరో నలుగురు నిందితులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెదర్లాండ్ నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్న ఓ వ్యక్తి కాల్‌డేటా..బ్యాంక్ లావాదేవీల ఆధారంగా నిందితులను గుర్తించారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో మొత్తం 15 మంది మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ఇప్పటికే ఆరుగురు అరెస్టు అవ్వగా..తాజాగా మరో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కిలో గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలినవారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో జూన్ 23వ తేదీన ఆరుగురిని భీమవరం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్టుగా వెల్లడించారు.