ధావత్‌కు పిలిచిన మహిళపై లైంగికదాడి చేసి హత్య
కామాగ్నికి మరో అబల బలైంది. ఓ కిరాతకుడు మద్యం మత్తులో ఓ మహిళపై లైంగిక దాడిచేసి హత్యచేశాడు. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వెలుగుచూసింది.
కామాగ్నికి మరో అబల బలైంది. ఓ కిరాతకుడు మద్యం మత్తులో ఓ మహిళపై లైంగిక దాడిచేసి హత్యచేశాడు. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వెలుగుచూసింది. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిదిలోని జియాగూడ కేశవస్వామినగర్ ప్రాంతానికి చెందిన అండాలు(47) జియాగూడ మేకల మండిలో మేకలవ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అండాలుకు భర్త రాములు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల జియాగూడ కేశవస్వామినగర్‌లో సొంతిల్లు నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం పూర్తికావస్తుడడంతో మేస్త్రీ, కూలీలకు ధావత్‌ను ఏర్పాటు చేశారు.
అయితే, మేస్త్రీకీ తోడు అతని స్నేహితుడు రవి కూడా ధావత్‌కు హాజరయ్యాడు. అర్థరాత్రి దాటాక విందు పూర్తి అయ్యాక ఇంటి మొదటి అంతస్తుపైకి పడుకోవడానికి అండాలు వెళ్లింది. ఇది గమనించిన రవి అనే వ్యక్తి డాబాపై ఉన్న ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు దుర్మార్గుడు. పై అంతస్తుకు వెళ్లిన రవి కిందకు రాకపోవడంతో రాములు, కుమారుడు వెళ్లి చూసేసరికి ఆమె మృతిచెందిందని పోలీసులు తెలిపారు. రవిని పట్టుకోవడానికి కుటుంబసభ్యలు ప్రయత్నించగా పరారయ్యాడన్నారు. భర్త రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కుల్సుంపురా పోలీసులు కామాంధుడు రవి కోసం గాలింపు చేపట్టారు.