Car rams into Hussain Sagar: హైదరాబాద్ నగరంలో కారు భీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ పార్కు వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న యువకులను బయటకుతీసి.. యశోద ఆసుపత్రికి తరలించారు. యువకులను ఖైరతాబాద్‌కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. కారును నాలుగు రోజుల క్రితమే తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్‌లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు వెల్లడించారు. సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యటు చేపట్టినట్లు వెల్లడించారు. అధిక వేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకం రేపింది.
Also Read: