Murder: భర్తతో విభేదాలు.. పగ పెంచుకున్న భార్య అతన్ని చంపేసింది.. అయినా కసితీరక పురుషాంగం కోసి నూనెలో వేంపి..

|

Jun 12, 2021 | 7:56 AM

Murder: భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండటం సాధారణమని మనందరికీ తెలుసు. చాలా మంది కలహాలను కూడా లైట్ తీసుకుని తిరిగి ఒక్కటవుతుంటారు.

Murder: భర్తతో విభేదాలు.. పగ పెంచుకున్న భార్య అతన్ని చంపేసింది.. అయినా కసితీరక పురుషాంగం కోసి నూనెలో వేంపి..
Murder
Follow us on

Murder: భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండటం సాధారణమని మనందరికీ తెలుసు. చాలా మంది కలహాలను కూడా లైట్ తీసుకుని తిరిగి ఒక్కటవుతుంటారు. అయితే కొన్ని కలహాలు మాత్రం విపరీత పరిణామాలకు దారి తీస్తాయి. చివరికి విడాకుల వరకు వెళ్తాయి. ఇదిలాఉంటే.. మరికొన్ని హత్యల వరకు కూడా దారి తీస్తాయి. ఇలాంటి షాకింగ్ ఘటనే తాజాగా ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు చూస్తే షాక్ అవుతారు.

బ్రెజిల్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి.. 33 ఏళ్ల మహిళ క్రిస్టినా రోడ్రిగెజ్ మసాడో తన భర్తను చంపేసింది. అంతటితో శాంతించని క్రిస్టినా అతని పురుషాంగాన్ని కట్ చేసి నూనెలో ఫ్రై చేసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న క్రిస్టినా.. విచారణ సందర్భంగా కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించింది. ఈ సమాచారం ప్రకారం.. క్రిస్టినా తన భర్త ఆండ్రీతో కలిసి సావో గొన్సాలో నివసిస్తుంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ వివాహ బంధం తెంచుకోవాలనే అంశంపై చర్చించారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఘర్షణల నేపథ్యంలో విడాకులు తీసుకోవాలని క్రిస్టినా డిసైడ్ అయ్యింది. ఆండ్రీ అందుకు అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్యా నిత్యం ఘర్షణలు కొనసాగుతూనే ఉండేవి. ఒకానొక సందర్భంలో.. నువ్వు నాతో ఉండకపోతే.. మరెవరితోనూ ఉండలేవని క్రిస్టినాకు ఆండ్రీ నచ్చజెప్పే ప్రయత్నంచేయగా.. అతన్ని చంపేస్తానంటూ క్రిస్టినా బెదిరించింది. అలా పలుమార్లు బెదిరింపులకు పాల్పడిన క్రిస్టినా చివరకు అన్నంత పని చేసింది. అతన్ని కత్తితో పొడిచి చంపేసిన క్రిస్టినా.. ఆగ్రహంతో అతని పురుషాంగాన్ని కూడా కోసింది. ఆపై నూనెలో వేయించింది. విచారణలో క్రిస్టినా చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు.

Also read:

Swab Stick Broken in Nose: కరోనా పరీక్ష కేంద్రం ముఖ్య అతిథి ముక్కులో విరిగిన స్వాబ్‌ స్టిక్‌.. తొలి టెస్టు చేస్తుండగా ఘటన !

Hair Fall: జుట్టు బాగా రాలిపోతుందా?.. ఈ 3 హోమ్ రెమెడీస్ ట్రై చెయ్యండి.. అద్భుతమైన ఫలితాలు చూడండి..!