ఆర్మీ శిక్షణ కేంద్రం దగ్గర పేలుడు.. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు

తమిళనాడు కాంచీపురం జిల్లాలో భారీగా రాకెట్ లాంచర్లు లభ్యమయ్యాయి. హనుమంతపురంలో రామకృష్ణన్ అనే రైతుకు దొరికిన వస్తువు కింద పడి పేలింది. ఆర్మీ శిక్షణ కేంద్రం దగ్గర్లో ఈ భారీ పేలుడు సంభవించడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. రామకృష్ణన్ ఇంట్లో సోదాలు చేపట్టారు. అక్కడ మూడు రాకెట్ లాంచర్లు, వందకు పైగా పేలుడు సామాగ్రి దొరికింది. గతంలోనూ ఇదే ప్రాంతంలో లాంచర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఇక దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. ఉగ్రవాద […]

ఆర్మీ శిక్షణ కేంద్రం దగ్గర పేలుడు.. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 14, 2019 | 2:18 PM

తమిళనాడు కాంచీపురం జిల్లాలో భారీగా రాకెట్ లాంచర్లు లభ్యమయ్యాయి. హనుమంతపురంలో రామకృష్ణన్ అనే రైతుకు దొరికిన వస్తువు కింద పడి పేలింది. ఆర్మీ శిక్షణ కేంద్రం దగ్గర్లో ఈ భారీ పేలుడు సంభవించడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. రామకృష్ణన్ ఇంట్లో సోదాలు చేపట్టారు. అక్కడ మూడు రాకెట్ లాంచర్లు, వందకు పైగా పేలుడు సామాగ్రి దొరికింది. గతంలోనూ ఇదే ప్రాంతంలో లాంచర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఇక దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైతుకు ఈ పేలుడు సామాగ్రి ఎక్కడ లభించింది..? ఆ సామాగ్రిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు..? తీవ్రవాదులు ఆ ప్రాంతంలో ఏదైనా డంప్‌ పెట్టారా..? రామకృష్ణన్ ఇంట్లోనే కాకుండా మిగిలిన వారి ఇంట్లో ఇలాంటి సామాగ్రి ఏదైనా ఉందా..? అన్న కోణంలో వారు దర్యాప్తును ప్రారంభించారు.