ఓ మై గాడ్..అసలేది, నకలేది…
దైవ దర్శనం టికెట్ల కోసం, సేవల కోసం వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారా?. అయితే తస్మాత్ జాగ్రత్త. జనాల్లోని భక్తిని క్యాష్ చేసుకునేందుకు నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయాలన్నింటిని ఈ నకిలీ వెబ్‌సైట్ల ముఠా టార్గెట్ చేసింది. తిరుమల కొండకు ఎక్కకుండానే నిలువు దోపిడి చేసేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఆర్జిత సేవల పేరుతో భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖ దేవాలయాల ఆర్జిత సేవా టిక్కెట్లు అంటూ ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు నిర్వాహకులు. ఒక్కొ టికెట్‌పై వంద నుంచి […]
దైవ దర్శనం టికెట్ల కోసం, సేవల కోసం వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారా?. అయితే తస్మాత్ జాగ్రత్త. జనాల్లోని భక్తిని క్యాష్ చేసుకునేందుకు నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయాలన్నింటిని ఈ నకిలీ వెబ్‌సైట్ల ముఠా టార్గెట్ చేసింది. తిరుమల కొండకు ఎక్కకుండానే నిలువు దోపిడి చేసేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఆర్జిత సేవల పేరుతో భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రముఖ దేవాలయాల ఆర్జిత సేవా టిక్కెట్లు అంటూ ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు నిర్వాహకులు. ఒక్కొ టికెట్‌పై వంద నుంచి 2వందలు, 3 వందల శాతం వరకు రేట్లను పెంచేసి అమ్మేస్తున్నారు. ఒక్క టీటీడీ 3 వందలకు అమ్మే దర్శనం టికెట్‌ను.. వెయ్యి రూపాయలకు అమ్మేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్‌సైట్లపై ఏపీ దేవాదాయ శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు నిందితులను పట్టుకునే పని చేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలీ ఉండేలా నకిలీ వెబ్‌సైట్‌లు.. క్రియేట్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ దేవాలయమైన అధికారిక వెబ్‌సైట్‌లో తప్ప వేరే వైబ్‌సైట్లనుంచి తీసుకున్న టికెట్లను అనుమతించరు. ఈ భాగోతం తిరుమలలోనే కాదు.. విజయవాడ దుర్గగుడిలోనూ వెలుగు చూసింది. నకిలీ వెబ్‌సైట్‌లో ఆర్జిత సేవ టిక్కెట్లను అమ్ముతూ భక్తుల జేబులను ఖాళీ చేస్తుండగా.. నిర్వాహకులు మాత్రం డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే దుర్గగుడి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అటు శ్రీకాళహస్తి దేవాలయంలో రాహు కేతు పూజలు చేస్తాం అంటూ నకిలీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. స్వయంగా ఆలయ అర్చకులే జనాల నుంచి డబ్బలు వసూలు చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ విషయంలో ఆలయం అర్చకులు సూర్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింహాచలం దేవాలయంలోనూ దర్శనాలకు సంబంధించిన నకిలీ వెబ్‌సైట్ వెలుగులోకి వచ్చింది. ఇక నెల్లూరు జిల్లా పెంచలకోన దేవాలయంలోనూ నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవాలయంలోనూ ఇదే విధంగా నకిలీ వెబ్‌సైట్‌ల మాయాజాలం భక్తులను నిండా ముంచుతోంది. గూగుల్‌లో లభ్యమవుతున్న ఈ నకిలీ వెబ్‌సైట్ల వల్ల .. ఏది అసలుదో ఏది నకిలీదో తెలియక మోసపోతున్నారు భక్తులు.