పశ్చిమ బెంగాల్ ఎన్నికలుః నందిగ్రామ్‌లో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య.. టీఎంసీ నేతలే కారమంటున్న ఆరోపిస్తున్న నేతలు..!
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కలకలం రేపింది.
bjp worker found hanging: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కలకలం రేపింది. తన ఇంట్లో ఓ బీజేపీ కార్యకర్త గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నందిగ్రామ్ లోని బేకుటియా ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త ఉదయ్ దూబే గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇతని ఆత్మహత్యకు టీఎంసీనే కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు.ఉదయ్ దూబే సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి రోడ్ షో కు హాజరైన తర్వాత టీఎంసీ నుంచి బెదిరింపులు రావడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు చెబుతున్నారు.
బీజేపీ కార్యకర్త ఆత్మహత్య వెనుక టీఎంసీ ఉందని సువేందు అధికారి ఆరోపించారు. కాగా, ఉదయ్ దూబే కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని టీఎంసీ నేతలు అంటున్నారు. పోలీసులు బీజేపీ కార్యకర్త మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మరణానికి కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.