Covid-19: ఆమె వల్లే కరోనా సోకిందని.. నర్సింగ్ స్టూడెంట్‌పై కత్తితో దాడి.. కుటుంబంపై..

Bengaluru nursing student: దేశంలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ తరుణంలో ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు సేవలు అందిస్తున్నారు. ఇలాంటి విపత్కర

Covid-19: ఆమె వల్లే కరోనా సోకిందని.. నర్సింగ్ స్టూడెంట్‌పై కత్తితో దాడి.. కుటుంబంపై..
attack

Edited By:

Updated on: May 18, 2021 | 8:38 AM

Bengaluru nursing student: దేశంలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ తరుణంలో ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు సేవలు అందిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారిని కీర్తించాల్సింది పోయి కొంతమంది అవమానపరుస్తున్నారు. కరోనా పేరుతో వైద్య సిబ్బందిని అవమానిస్తూ.. వారిపై దాడులకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. తమ ఇంటి పక్కన ఉండే నర్సింగ్‌ విద్యార్థిని వల్ల తమకు కరోనావైరస్‌ సోకిందని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తులు ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన ఆమె తండ్రిని బూతులు తిడుతూ.. అవమానించి కొట్టారు. ఈ అవమానకర సంఘటన బెంగళూరు ఇందిరానగర్‌ లక్ష్మీపురం ప్రాంతంలో జరిగింది.

లక్ష్మీపూరం ప్రాంతానికి చెందిన ప్రియదర్శి (20) నర్స్‌ ట్రైనింగ్‌ చేస్తుంది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆమె తల్లి కోవిడ్‌ బారిన పడింది. ఆ తర్వాత వారి ఇంటి పక్కన నివాసం ఉండే ప్రభుకి గత నెలలో కోవిడ్‌-19 సోకింది. ఈ క్రమంలో ప్రభు, ప్రియదర్శి వల్లే తాను కోవిడ్‌ బారిన పడ్డానని ఆరోపించాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ప్రభు, అతని ఇద్దరు సోదరులు ప్రియదర్శి తండ్రితో గొడవకు దిగాడు. ప్రియదర్శి వారిని వారిస్తుండగా.. కోపంతో రగిలిపోయిన ప్రభు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రియదర్శి చెయ్యి తెగింది. అనంతరం ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియదర్శి ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read;

బ్లేడ్‌తో భార్య గొంతుకోసిన భర్త..! నిందితుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు.. కారణాలు ఇలా ఉన్నాయి..?

ఇజ్రాయెల్ లో నిర్మాణంలో ఉన్న ప్రార్థనా మందిరం కూలి ఇద్దరి మృతి, 160 మందికి పైగా గాయాలు, ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వ ఆదేశం