AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triple Talaq: నల్లగా ఉన్నావంటూ తలాక్.. పెళ్లైన తొమ్మిది నెలలకే బయటపడిన దుర్మార్గుడి అసలు రంగు

Divorce Case: భారీగా కట్న కానుకలు తీసుకొని.. ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో తొమ్మిది నెలలపాటు జీవనం సాగించాడు. చివరకు భార్య నల్లగా ఉందంటూ తలాక్ చెప్పాడు. దీంతో

Triple Talaq: నల్లగా ఉన్నావంటూ తలాక్.. పెళ్లైన తొమ్మిది నెలలకే బయటపడిన దుర్మార్గుడి అసలు రంగు
Divorce
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 22, 2021 | 12:20 PM

Share

Divorce Case: భారీగా కట్న కానుకలు తీసుకొని.. ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో తొమ్మిది నెలలపాటు జీవనం సాగించాడు. చివరకు భార్య నల్లగా ఉందంటూ తలాక్ చెప్పాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వెలుగులోకి వచ్చింది. నల్లగా ఉన్నాననే కారణంతో తన భర్త తలాక్‌ చెప్పాడంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్త సహా.. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్ ప్రాంతానికి చెందిన యువతితో తొమ్మిది నెలల క్రితం మహ్మద్ ఆలం అనే వ్యక్తి ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో సుమారు మూడెకరాల భూమి, ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. కొన్ని రోజులపాటు ఆమెతో కాపురం చేసిన ఆలం.. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించటం ప్రారంభించారు.

బాధితురాలి తండ్రి వద్ద మిగిలి ఉన్న భూమిని విక్రయించి రూ.10 లక్షలు తేవాలని హింసించడం మొదలుపెట్టాడు. అందుకు మహిళ నిరాకరించటంతో దాడి చేశారు. అయితే.. ఈ సమయంలో తండ్రి జోక్యంతో సద్దుమణిగినట్లు మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఆ తర్వాత తాను నల్లగా ఉన్నానంటూ తన భర్త, అత్తింటివారు హేళన చేయటంతోపాటు ప్రతిరోజు హింసిస్తున్నారని వెల్లడించింది.

ఈ క్రమంలో నల్లగా ఉన్నావు.. ఇక వద్దంటూ తన భర్త ఆలం మూడు సార్లు తలాక్ చెప్పి ఇంట్లో నుంచి గెంటేశాడని బాధితురాలు బరేలీ ఎస్‌ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త ఆలం, అత్తామామ సహా.. ఎనిమిది మందిపై కాంట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రాజీవ్‌ సింగ్‌ వెల్లడించారు.

Also Read:

Tamil Nadu: విధుల్లో ఎస్ఐపై వేట కొడవళ్లతో దాడి.. దారుణంగా హత్య చేసిన మేకల దొంగలు..

Captain Abhinandan Varthaman: అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం.. ప్రదానం చేసిన రాష్ట్రపతి..