AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sindhu Sri Death Mystery : తల్లి ప్రియుడే పాప హంతకుడు..! ముద్దులొలికే సింధుశ్రీ ని అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకుంది అతడే..!

చిన్నారి తల్లి వరలక్ష్మి సహజీవనం చేస్తున్న జగదీష్ అనే వ్యక్తే ఈ మహాపాపానికి ఒడిగట్టాడు. సింధు శ్రీని తానే..

Sindhu Sri Death Mystery : తల్లి ప్రియుడే పాప హంతకుడు..!   ముద్దులొలికే సింధుశ్రీ ని అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకుంది అతడే..!
Sindhusri Death Mistery
Venkata Narayana
|

Updated on: Jun 05, 2021 | 1:00 PM

Share

Girl Sindhu Sri Death Mystery : తల్లి ప్రియుడే చివరికి ఆ చిన్నారి పాలిట కాలయముడయ్యాడు. అభం శుభం తెలీని.. ముద్దులొలికే సింధుశ్రీ ని అత్యంత కిరాతకంగా పొట్టన బెట్టుకున్నాడు. విశాఖకు చెందిన చిన్నారి సింధు శ్రీ అనుమానాస్పద మృతి కేసును విశాఖ పోలీసులు ఎట్టకేలకు చేధించారు. చిన్నారి తల్లి వరలక్ష్మి సహజీవనం చేస్తున్న జగదీష్ అనే వ్యక్తే ఈ మహాపాపానికి ఒడిగట్టాడు. సింధు శ్రీని తానే చంపానంటూ పోలీసుల విచారణలో జగదీష్ ఒప్పుకున్నాడు. దీంతో నాలుగు రోజుల క్రితం చిన్నారి సింధుశ్రీ అనుమానస్పద మృతి మిస్టరీ వీడింది. సింధుశ్రీ తండ్రి రమేష్ ఫిర్యాదుతో ఈ దారుణం బయట పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని కొట్టి గాయపరిచి చిన్నారికి ఒంట్లో బాగాలేదని నమ్మించేందుకు పలు ఆసుపత్రులకు తీసుకు వెళ్లినట్లు పోలీసులకు జగదీష్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే, చిన్నారి సింధుశ్రీ హత్యకేసులో తల్లి వరలక్ష్మి పాత్ర పైన కూడా ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. చిన్నారి శవాన్ని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 24 గంటల్లో పోస్టుమార్టం నివేదిక రానుంది. దీంతో మరిన్ని నిజాలు బయటకు రానున్నాయి. కాగా, తన బిడ్డ ఏం పాపం చేసిందని పొట్టన బెట్టుకున్నాడంటూ సింధుశ్రీ తండ్రి రమేష్ పాపను పూడ్చిపెట్టిన సమాధి దగ్గరే భోరున విలపిస్తూ ప్రశ్నిస్తున్నాడు..

Read also : RRR : AP CID అడిషినల్ డీజీకి లీగల్ నోటీసులు పంపించిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు