AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనానికి పిలవలేదని కత్తితో దాడి..శత్రువులుగా మారిన ప్రాణ స్నేహితులు..కారణం తెలిస్తే షాక్ అవుతారు..

వారిద్దరు ప్రాణ స్నేహితులు.. కష్టం వస్తే ఒకరికొకరు సాయం చేసుకుంటారు. కానీ ఇప్పుడు బద్ద శత్రువులుగా మారిపోయారు

భోజనానికి పిలవలేదని కత్తితో దాడి..శత్రువులుగా మారిన ప్రాణ స్నేహితులు..కారణం తెలిస్తే షాక్ అవుతారు..
uppula Raju
|

Updated on: Dec 13, 2020 | 9:24 AM

Share

వారిద్దరు ప్రాణ స్నేహితులు.. కష్టం వస్తే ఒకరికొకరు సాయం చేసుకుంటారు. కానీ ఇప్పుడు బద్ద శత్రువులుగా మారిపోయారు కారణం రాజకీయం. ఇద్దరు వేర్వేరు రాజకీయ పార్టీల్లో తిరగడంతో ప్రాణ స్నేహితులు కాస్తా బద్ధ శత్రువులుగా మారిపోయారు. అయితే ఇటీవల ఒకరి ఇంట్లో ఫంక్షన్ జరగ్గా మరో వ్యక్తిని భోజనానికి పిలవలేదు. దీంతో అతడు కత్తితో దాడి చేశాడు. బొల్లాపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

బొల్లాపల్లి మండలంలోని గరికపాడుకు చెందిన మొక్కపాటి రామారావు అదే గ్రామానికి చెందిన పసుపులేటి రత్నం చాలకాలం నుంచి స్నేహితులు. వీరు రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. దీంతో వీరిమధ్య వైరుధ్యం ఏర్పడింది. దీంతో ఇద్దరు విడిపోయారు. అయితే ఇటీవల రామారావు తల్లి చనిపోవడంతో పెద్దకర్మ సందర్భంగా రత్నాన్ని భోజనానికి పిలవలేదు. దీంతో కక్ష పెంచుకున్నరత్నం రామారావుకి ఫోన్‌చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆయన బండ్లమోటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మండిపోయిన రత్నం ఎలాగైనా రామారావుపై దాడి చేయాలని అనుకున్నాడు. సందర్భం కోసం వేచి చూసిన రత్నం, బజారులో ఒంటరిగా కూర్చున్న రామారావుపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో పొట్ట, వీపుపై గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే రామారావును ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే