Crime News: అనుమానాస్పదస్థితిలో నేల బావిలో శవమైన యువకుడు.. పోలీసుల దర్యాప్తులో సంచలనాలు!

|

Jan 24, 2022 | 11:50 AM

విశాఖ జిల్లాలో యువకుడు అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వన్యప్రాణుల వేట కోసం వెళ్లి.. జంతువుల కోసం పెట్టిన ఉచ్చులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.

Crime News: అనుమానాస్పదస్థితిలో నేల బావిలో శవమైన యువకుడు.. పోలీసుల దర్యాప్తులో సంచలనాలు!
Follow us on

Vizag Young man Death Mystery:  విశాఖ జిల్లాలో యువకుడు అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వన్యప్రాణుల వేట కోసం వెళ్లి.. జంతువుల కోసం పెట్టిన ఉచ్చులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

వన్యప్రాణుల వేటకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో నేల బావిలో శవంగా మారిన నవీన్ అనే యువకుడు డెత్ మిస్టరీ విశాఖపట్నం జిల్లా పోలీసులు ఛేదించారు. కోటవురట్ల మండలంలోని పందూరుకు చెందిన మల్లవరపు నవీన్.. ఈ నెల 6న అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ, రాజుతో కలిసి సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లాడు. నవీన్‌తో వేటకు వెళ్లిన ఇద్దరూ అదే రోజు సాయంత్రం ఇళ్లకు చేరుకోగా.. నవీన్ మాత్రం తిరిగి రాలేదు. దీంతో నవీన్ కుటుంబ సభ్యులు గాలించారు. అయితే, నవీన్ వెళ్లిన రెండు రోజుల తర్వాత పొలాల్లోని నేలబావిలో నవీన్ మృతదేహం బయటపడింది. మెడకు ఇనుప తీగతో బండరాయి కట్టి ఉన్నట్టు గుర్తించారు. అయితే, నవీన్‌ను హత్య చేసి బావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.

కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.. విచారణలో భాగంగా సత్యనారాయణ, రాజును అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించిన ఆశించినంత క్లూస్ లభించలేదు. అయితే.. పందూరు పరిసర గ్రామాల్లో వన్యప్రాణులను వేటాడే వారిపై పోలీసులు దృష్టిసారించారు. కొందరిని పిలిచి విచారించారు. అడవి పందులను వేటాడేందుకు ఏర్పాటు చేసే విద్యుత్తు కంచె తగిలి నవీన్ మృతి చెందాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. నవీన్, సత్యనారాయణ, రాజు వేటకు వెళ్లడానికి ముందు రోజు పందూరుకు గ్రామానికి చెందిన ఈశ్వరరావు, కైలాసపట్నంకు చెందిన కళ్యాణం, నూకరాజు కలిసి అడవి పందుల కోసం పొలం చుట్టూ విద్యుత్తు తీగలతో ఉచ్చును ఏర్పాటు చేశారు. వేటకు వెళ్లిన నవీన్ ఆ ఉచ్చుకు చిక్కి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉచ్చుపెట్టిన ఈశ్వరరావు, కళ్యాణం, నూకరావు ఈ కేసు తమ మెడ చుటుకుంటుందోనన్న భయంతో తీగను నవీన్ మేరకు కట్టే బండరాయితో కట్టి బావిలో పడేశారు. నేరాన్ని నిందితులు ఒప్పుకోవడంతో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల నుంచి ఒక నాటు తుపాకి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also… Salman Khan: సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‏లో సెలబ్రెటీస్ శవాలున్నాయంటూ ఆరోపణ.. పరువు నష్టం దావా వేసిన సల్లు భాయ్..