Fake challans: వెలుగులోకి వస్తున్న రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో బోగస్‌ చలానాలు.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టిన అధికారులు

సీఎ్‌ఫఎంఎస్‌ విధానంలో లోపాలను ఆసరాగా చేసుకుని బోగస్ చలానాలు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు..

Fake challans: వెలుగులోకి వస్తున్న రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో బోగస్‌ చలానాలు.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టిన అధికారులు
Register Officers Conducting Inspections

Updated on: Aug 07, 2021 | 1:39 PM

AP Fake challans in Registration offices: రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో బోగస్‌ చలానాలపై తనిఖీలు మొదలయ్యాయి. సీఎ్‌ఫఎంఎస్‌ విధానంలో లోపాలను ఆసరాగా చేసుకుని కొంతమంది డాక్యుమెంట్‌ రైటర్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, తిరుపతి అర్బన్‌ తదితర చోట్ల మోసాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కర్నూలు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలతో అధికారులు దూకుడు పెంచారు. కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో లొసుగులను ఆసరగా చేసుకుని కొందరు డాక్యుమెంట్ రైటర్లతో రిజిస్ట్రేషన్ సిబ్బంది కుమ్మక్కై అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు విచారణ ఆదేశించారు. కర్నూలు, కల్లూరు, నంద్యాల కార్యాలయాల్లో విచారణ జరుగుతోంది. ఈ మేరకు అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎంత మేర అవినీతి జరిగింది. ఎవరెవరికి ప్రమేయం ఉందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో తీసుకున్న ఒక చలానాను ఇతర రిజిస్ట్రేషన్లకు వాడడం.. ఫేక్ చలానాలు సృష్టించడం ద్వారా అవినీతికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

సీఎ్‌ఫఎంఎస్‌ విధానంలో లోపాలను ఆసరాగా చేసుకుని కొంతమంది డాక్యుమెంట్‌ రైటర్లు ప్రభుత్వ ఖజానాకు  గండి కొడుతున్నారు.కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, తిరుపతి అర్బన్‌ తదితర చోట్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు తెలియడంతో.. మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆధికారులు చర్యలు చేపట్టారు. సంబంధిత కార్యాలపై దాడి చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లోనూ గత మూడు నెలలుగా డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్‌కు వచ్చిన చలానాలను పరిశీలించాలని, ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము మొత్తం వచ్చిందో లేదో చూడాలని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్స్‌ శాఖ ఐజీ శేషగిరిబాబు ఆదేశించారు.

ఈ మేరకు కడప సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో 10 బోగస్‌ చలానాలను గుర్తించారు. కడప కడప అర్బన్‌, రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో స్టాంపుడ్యూటీ రుసుమును డాక్యుమెంట్‌ రైటర్‌ జయరామకృష్ణ బోగస్‌ చలానాలతో స్వాహా చేసినట్లు తేలడంతో ఆయనపై ఫోర్జరీ, చీటింగ్‌ కేసు నమోదు చేశారు. మిగతా కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు రిజిస్ర్టేషన్‌ చేయించుకునేవారు ఎంత మొత్తం చలానాగా కట్టారన్నది సబ్‌ రిజిస్ర్టార్‌ కంప్యూటర్‌లోనూ కనిపించేలా  సీఎ్‌ఫఎంఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేయనున్నారు.

Read Also….  Left Side Sleeping: మీరు ఎటువైపు తిరిగి నిద్రపోతున్నారు.. ఎడమవైపు తిరిగి నిద్రపోతే ఎన్ని ప్రయోజనాలో తెలుసా