Criminal Case on SI: రక్షకభటుడే భక్షకుడిలా మారాడు.. పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళపై కన్నేసిన సబ్ ఇన్‌స్పెక్టర్.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆనందరెడ్డి.. అదే పీఎస్‌లో పని చేస్తున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా సోషల్‌మీడియాలో మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో వెలుగులోకి రావటంతో ఆనందరెడ్డిపై కేసునమోదు చేశారు పోలీసులు. గతంలో సస్పెన్షన్ వేటుకు గురైన ఎస్ ఆనందరెడ్డిపై సెక్షన్ 131/22, u/s 376, 384, 506, యస్సీ- యస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం పోలీసులు తెలిపారు.