AP: చైన్ స్నాచర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు.. అతడెవరో తెలిసి నిర్ఘాంతపోయిన పోలీసులు

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కానిస్టేబుల్ పశ్చిమగోదావరి జిల్లాలో చైన్ స్నాచర్ గా మారి మహిళ మెడలోని గొలుసు లాక్కొని పారిపోతుండగా పోలీసులకు పట్టుబడ్డాడు.

AP: చైన్ స్నాచర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు.. అతడెవరో తెలిసి నిర్ఘాంతపోయిన పోలీసులు
Chain Snatcher Arrest

Updated on: Mar 31, 2022 | 3:22 PM

West Godavari: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కానిస్టేబుల్ దారితప్పాడు. దొంగగా మారాడు. మరో దొంగతో జతకలిసి వరుస చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకే సవాలుగా మారాడు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి(Undi)లో ఈ దొంగ పోలీస్ చేస్తున్న చైన్ స్నాచింగ్‌లు టాక్‌ ఆఫ్ ద టౌన్‌గా మారాయ్. స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి.  ఉండి పోలీస్ స్టేషన్‌లో 2008 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సింగిడి సత్యనారాయణ, మరో యువకుడు బుద్దా సుభాష్ (21)తో కలిసి చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయాడు. మహిళ మెడలో నుంచి గోల్డ్‌ చైన్ లాక్కుని పారిపోతుండగా పట్టుకున్నారు స్థానికులు. చైన్‌ స్నాచర్లను పోలీసులకు అప్పగించగా, కానిస్టేబుల్‌ సింగిడి సత్యనారాయణ అసలు రూపం బయటపడింది. పెప్పర్‌ స్ప్రే(Pepper Spray) కొడుతూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు దొంగ పోలీస్ సత్యనారాయణ. సత్యనారాయణ ఇటీవల క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ పేకాటకు అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకే చోరీల బాటపట్టినట్లు చెప్పాడు.  ఈ ఘటనకు సంబంధించి సత్యనారాయణను బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి గొలుసు, కత్తి, పెప్పర్ స్ప్రే బాటిల్, రూ.1,20,000 విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. కైకలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read: Viral Video: నడిరోడ్డుపై దగ్ధమైన మరో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే కంగుతింటారు