AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఏటీఎంలో చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిన దొంగ.. ఆ తర్వాత జింతాక చితక..

Viral Video: ఏటీఎంలో చోరీ చేస్తూ పట్టుబడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు ఏటీఎంను బద్దలు కొట్టడం ఇందులో చూడవచ్చు. పోలీసులు ఆ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని జైలుకు పంపారు.

Watch Video: ఏటీఎంలో చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిన దొంగ.. ఆ తర్వాత జింతాక చితక..
Atm Thief
Sanjay Kasula
|

Updated on: Aug 29, 2022 | 1:39 PM

Share

దొంగలకు డబ్బులు అవసరమైనప్పుడల్లా.. ఏటీఎంలపై పడుతున్నారు. ఎనీటైంమనీ అవలేబుల్‌గా ఉండే ఏటీఎంలు లక్ష్యంగా చోరీకి తెగబడుతున్నారు. అయితే ఇలా చేయడం అందరు దొంగలకు సాధ్యం కాదు. ఏటీఎంకు కన్నం వేయడం కూడా ఎంత కష్టం. అంత కష్టపడీ కన్నం వేసి.. తీసుకెళ్తే ఏం తీసుకెళ్తారు.. డబ్బే కదా. ఇక్కడో ట్విస్ట్ ఉన్నట్లుంది కదా. సరిగ్గా చోరీ చేస్తుండగా పోలీసులు చాకచక్యంగా వ్యహరించారు. అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ చేస్తుండగా అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ చారా చొక్కల చోరుడు చోరీ చేస్తు దొరికి పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ యువకుడు ఏటీఎం పగలగొట్టి చోరీ చేయడాన్ని మీరు చూడవచ్చు. పోలీసులు అక్కడికి చేరుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో యువకుడు ఏటీఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం…

శుక్రవారం రాత్రి సంజయ్ ప్లేస్‌లో ఉన్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏటీఎంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు ఈ ఏటీఎం దొంగ. ముందు గుర్తించిన బ్యాంకు కంట్రోల్‌ రూం అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను చాలా ఈజీగా పట్టుకున్నారు.

ఈ ఘటన మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో జరిగింది. ఆ సమయంలో కూడా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యహరించారు. ఏటీఎంలో ఓ యువకుడు ఇనుప కడ్డీతో ఏటీఎం మిషిన్‌ను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏటీఎం మిషిన్ పగలగొడుతుండగా సీసీటీవీ మానిటరింగ్‌లో చూసిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం