AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: కంగ‌నా ర‌నౌత్ బాడీగార్డ్‌పై అత్యాచార కేసు నమోదు.. పెళ్లి చేసుకుంటాన‌ని మోస‌గించ‌డ‌మే కాకుండా..

Kangana Ranaut Bodyguard : కంగనా ర‌నౌత్ వ్య‌క్తిగ‌త బాడీగార్డ్ కుమార్ హెగ్డేపై అత్యాచార కేసు న‌మోదైంది. ముంబ‌యికి చెందిన ఓ మేక‌ప్ ఆర్టిస్ట్ త‌న‌పై కుమార్ హెగ్డే లైంగిక దాడికి దిగాడ‌ని ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలోనే...

Kangana Ranaut: కంగ‌నా ర‌నౌత్ బాడీగార్డ్‌పై అత్యాచార కేసు నమోదు.. పెళ్లి చేసుకుంటాన‌ని మోస‌గించ‌డ‌మే కాకుండా..
Kangana Bodygiuard
Narender Vaitla
|

Updated on: May 22, 2021 | 8:44 AM

Share

Kangana Ranaut Bodyguard : కంగనా ర‌నౌత్ వ్య‌క్తిగ‌త బాడీగార్డ్ కుమార్ హెగ్డేపై అత్యాచార కేసు న‌మోదైంది. ముంబ‌యికి చెందిన ఓ మేక‌ప్ ఆర్టిస్ట్ త‌న‌పై కుమార్ హెగ్డే లైంగిక దాడికి దిగాడ‌ని ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ముంబ‌యిలోని డీఎన్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఈ క్ర‌మంలో బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తూ.. న‌టి కంగ‌నా ర‌నౌత్ బాడీగార్డ్ కుమార్ వివాహం చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేయ‌డంతో పాటు త‌న నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడ‌ని పేర్కొంది. కుమార్‌కు స‌ద‌రు మేక‌ప్ ఆర్టిస్ట్‌తో ఎనిదేళ్ల క్రితం ప‌రిచయం ఏర్ప‌డిన‌ట్లు స‌మాచారం. గ‌తేడాది జూన్‌లో వివాహం చేసుకుంటాన‌ని ప్ర‌పోజ్ చేశాడని… ఈ నేప‌థ్యంలో త‌న ఫ్లాట్‌కు వ‌చ్చిన కుమార్ త‌న‌పై ప‌లుమార్లు లైంగిక దాడికి దిగాడ‌ని ఆరోప‌ణ‌లు చేసింది. అంత‌టితో ఆగ‌కుండా కుమార్ త‌న సొంత ప్రాంత‌మైన క‌ర్ణాట‌క‌కు వెళ్లే ముందు త‌న‌కు ఏప్రిల్ 27న డ‌బ్బులు ఇచ్చిన‌ట్లు మేక‌ప్ ఆర్టిస్ట్ చెప్పుకొచ్చింది. అనంత‌రం కుమార్ త‌ల్లితో మాట్ల‌డ‌గా.. అత‌నికి వేరే అమ్మాయితో వివాహం నిశ్చ‌యం అయిన‌ట్లు తెలిపింద‌ని ఆమె వాపోయింది. అంతేకాకుండా త‌న కుమారుడి వెంట ప‌డొద్ద‌ని, పెళ్లి చేసుకోమ‌ని అడ‌గొద్ద‌ని కుమార్ త‌ల్లి చెప్పింద‌ని బాధితురాలు చెప్పుకొచ్చింది. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై కంగ‌నా స్పందిస్తుందో లేదో చూడాలి.

Also Read: Mohanlal Birthday: భారతదేశం గర్వించదగ్గ సంపూర్ణ నట శిఖరం మోహన్‌ లాల్‌…

RGV Tweet: ప్ర‌భుత్వాలు ఫార్మా కంపెనీల‌కు ఫండ్స్ ఇవ్వ‌డం మానేసి.. ఆనంద‌య్య‌కు ఇవ్వాలి! వ‌ర్మ మార్క్ కామెంట్స్‌..

Hyderabad: యువతిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ అరెస్ట్.. సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు..