Sonu Sood: చిక్కుల్లో సోనూసూద్.. పన్ను ఎగవేతపై ఐటీ శాఖ కీలక ప్రకటన.. షాక్‌లో అభిమానులు

|

Sep 18, 2021 | 1:45 PM

బహుబాషా నటుడు సోనూసూద్ చిక్కుల్లో పడ్డారు. ఆయన ఇళ్లు, కార్యాల‌యాల‌పై దాడులు చేసిన ఐటీ శాఖ కీలక సమాచారాన్ని సేకరించింది.

Sonu Sood: చిక్కుల్లో సోనూసూద్.. పన్ను ఎగవేతపై ఐటీ శాఖ కీలక ప్రకటన.. షాక్‌లో అభిమానులు
Sonu Sood
Follow us on

బహుబాషా నటుడు సోనూసూద్ ఇళ్లు, కార్యాల‌యాల‌పై ఐటీ దాడులు నిర్వహించింది. వ‌రుస‌గా మూడోరోజుల పాటు సోదాలు చేసిన అధికారులు. దాడులకు సంబంధించి ఓ ప్రకటన చేశారు. సోనూసూద్‌ 20కోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేసినట్టు ఆధారాలు సేకరించినట్టు వెల్లడించారు. ముంబై, నాగ్‌పూర్‌, జైపూర్‌లలో ఏకకాలంలో 28 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. సోనూసూద్‌ ఆర్థిక లావాదేవీలతో పాటు.. సోనూసూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను కూడా ప‌రిశీలించారు. 11 లాకర్లను గుర్తించిన ఐటీ అధికారులు..కోటీ 8లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కరోనా టైమ్‌లో ఎంతోమంది వలస కూలీలను తమ గమ్యస్థానాలకు చేర్చిన సోనూసూద్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఐతే ఆ సమయంలో సోనూసూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌.. 18కోట్లకు పైగా విరాళాలు సేకరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు కోటీ 90లక్షల రూపాయలు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్టు బ్యాంక్‌ ట్రాన్జాక్షన్స్‌ బట్టి తెలుస్తోంది. ఐతే మిగిలిన డబ్బు ఏమైందన్న అంశంపై ఆరా తీస్తున్నారు అధికారులు.   ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాం ను ఉపయోగించి సోనూసూద్ విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించారని ఐటీ శాఖ అధికారులు చెప్పారు.  పన్ను ఎగవేత కోసం ఖాతాలను పుస్తకాల్లో రుణాలుగా మభ్యపెట్టారని అధికారులు వెల్లడించారు.  సోనూసూద్ కంపెనీకి, లక్నో రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య జరిగిన అగ్రిమెంట్‌పై ఆదాయపుపన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఒప్పందంలో సోనూసూద్ పన్ను ఎగవేశారని ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది.

ఐతే సోనూసూద్ ఇళ్లపై ఐటీ దాడులు చేయడంపై విమర్శలు కురిపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. సోనూసూద్‌ ఆమ్ ఆద్మీ పార్టీలో చేర‌తార‌నే.. ఆయ‌న ఇళ్లు, కార్యాలయాల‌పై ఐటీ దాడులు చేస్తున్నారని మండిప‌డుతున్నారు.

Also Read: Hyderabad: పెళ్లయిన మరుక్షణమే ప్రియుడితో వధువు జంప్.. ట్విస్ట్ ఏంటంటే

ఎదురీత ముందు విధిరాత ఎంత!.. ఒకప్పుడు అవమానాలు, ఛీత్కారాలు.. ఇప్పుడు సన్మానాలు