Money Laundering Case: మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే పలువురు నటులను విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కూడా నోటీసులు పంపింది. ఈ కేసులో జాక్వెలిన్ నాలుగోసారి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కాలేదు. గతంలో మూడు సార్లు కూడా హాజరుకాని జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. తాజాగా సోమవారం కూడా విచారణకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సుఖేష్ చంద్రశేఖర్, ఆయన భార్య లీనా పౌల్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే బాలీవుడ్ నటి నోరాఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఈడీ.. ఆమె వాంగ్మూలాన్ని ఆగస్టు 30వ తేదీన నమోదు చేసుకుంది. నాటి నుంచి ఫెర్నాండెజ్ విచారణకు హాజరుకావడం లేదు. సెప్టెంబర్ 25, అక్టోబర్ 15,16 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమె విచారణకు హాజరుకాలేదు. ఈ రోజు కూడా ఆమె హాజరు కావాల్సి ఉండగా.. హాజరుకాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వృత్తిపరంగా ఫెర్నాండెజ్ బిజీగా ఉండటంతో విచారణకు హాజరుకావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా.. ఈ మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే సుఖేష్ చంద్రశేఖర్, లీనా పౌలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపార వేత్త శివేందర్ సింగ్ భార్య అథితి సింగ్ ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నోరా ఫాతేహిను కూడా అధికారులు ప్రశ్నించి.. వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. జాక్వెలిన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసేందుకు ఈడీ విచారణకు పిలిచింది. గత మూడు సంవత్సరాల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన స్టేట్‌మెంట్లతో హాజరు కావాలని ఈడీ స్పష్టంచేసింది.
Also Read: