Crime News : చదివింది పదో తరగతే.. కానీ పేస్‌బుక్‌లో పండితుడు.. ఫొటోల మార్ఫింగ్‌తో బ్లాక్‌ మెయిలింగ్..

|

Aug 12, 2021 | 9:25 AM

Crime News : చదివింది పదో తరగతే కానీ పేస్‌బుక్‌లో పండితుడు. అందమైన అమ్మాయి ఫొటోతో పేస్‌బుక్ అకౌంట్ తెరిచి అట్రాక్ట్

Crime News : చదివింది పదో తరగతే.. కానీ పేస్‌బుక్‌లో పండితుడు.. ఫొటోల మార్ఫింగ్‌తో బ్లాక్‌ మెయిలింగ్..
Facebook Frad
Follow us on

Crime News : చదివింది పదో తరగతే కానీ పేస్‌బుక్‌లో పండితుడు. అందమైన అమ్మాయి ఫొటోతో పేస్‌బుక్ అకౌంట్ తెరిచి అట్రాక్ట్ మెస్సేజ్‌లతో చాటింగ్ చేస్తూ యువతుల ఫొటోలను మార్పింగ్ చేయడం మొదలెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా నడికుడ గ్రామానికి చెందిన గూనెల క్రాంతికుమార్‌ 10వ తరగతి చదివాడు. ఇతను లావణ్యరెడ్డి అనే పేరుతో 2019లో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. మగవారితో అమ్మాయిలాగా, మహిళలతో ఫ్రెండ్‌లాగా ఛాటింగ్‌ చేస్తుండేవాడు. ఇలా అయిదువేల మందిని తన ఫాలోవర్స్‌గా చేసుకున్నాడు. బాగా చనువుగా మాట్లాడే అమ్మాయిలకు నీలిచిత్రాలు పంపిస్తుండేవాడు.

అయితే గుంటూరుకు చెందిన ఓ యువతి అనుకోకుండా క్రాంతికుమార్ ట్రాప్‌లో పడిపోయింది. అతడు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ని ఆమె కూడా డౌన్‌లోడ్ చేసుకుంది. అందులోని అమ్మాయిల వివరాలు సేకరించిన క్రాంతి ఆమె ఫొటో చూసి వీడియో కాల్ చేశాడు. ఆమె కాల్ లిప్ట్ చేస్తూ మాట్లాడిన ఫొటోలను స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేశాడు. ఈక్రమంలో క్రాంతికుమార్‌ తాను ఎవరనేది తెలియకుండా ఉండటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేరే వాళ్ల ఫోన్‌, వాట్సప్‌ నంబర్ల ద్వారా ఆ యువతికి ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి పంపించి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో గుంటూరు పోలీసులు అతడిని గుర్తించి నగరంలోని ఓ లాడ్జి వద్ద అతడిని అరెస్ట్ చేశారు.

vishwak Sen: పాగల్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో విశ్వక్ సేన్ సంచనల వ్యాఖ్యలు.. లెక్క తప్పైతే పేరు మార్చుకుంటా అంటూ…

Teej Festival: హిందూ యువతులకు ముస్లిం యువకులు మెహందీ పెట్టకుండా చర్యలు చేపట్టిన క్రాంతి సేన

Covid-19 Third Wave: థర్డ్ వేవ్.. చిన్నారులపై కరోనా పంజా.. ఆ నగరంలో 242 మందికి పాజిటివ్..