మానవ సంబంధాలు రోజురోజుకు మరింత నీచస్థాయికి దిగజారుతున్నాయి. కనీస విలువలు పాటించడం లేదు కొందరు. అనుమానం ఎలాంటి దారుణాలు చేయిస్తుందో తాజా ఘటన ఉదహరిస్తుంది. భార్య విడాకులు ఇవ్వలేదన్న కోపంతో ఆమె పోస్టర్లను ఊరంతా అంటించాడు ఓ వ్యక్తి. “అవసరమైతే సంప్రదించండి” అంటూ కొన్ని ఫోన్ నెంబర్లు కూడా జతచేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని చిఖాలి తాలూకా బుల్దానాలో జరిగింది. నిందితుడి పేరు సమాధన్ నికల్జే. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
గత ఏడాది జూన్ 30 న అంచార్వాడికి చెందిన ఒక అమ్మాయిని సమాధన్ వివాహం చేసుకున్నాడు. కానీ అతను భార్యను నిత్యం అనుమానించేవాడు. ఈ క్రమంలో మానసిక, శారీరక వేధింపులకు గురిచేసేవాడు. దీంతో దీపావళి సందర్భంగా పుట్టింటికి వెళ్లిన ఆమె.. తిరిగి రాలేదు. దీంతో ఆగ్రహించిన సమాధన్ భార్య ఫోటోతో పోస్టర్ తయారు చేసి, బహిరంగ ప్రదేశాల్లో అతికించాడు. వీటిని గమనించిన సదరు మహిళ సోదరుడు సమాధన్‌ను ప్రశ్నించాడు. ఆమె విడాకులు ఇచ్చే వరకు ఇదే తంతు కొనసాగిస్తానని బెదిరించాడు సమాధన్. ఇప్పటివరకు తన పోస్టర్లు మాత్రమే వేశానని, మున్ముందు భార్య సోదరి, తల్లి ఫోటోలు కూడా వేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో, మహిళ సోదరుడి ఫిర్యాదుపై అంధేరా పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యను ఇలా వీధికెక్కించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడికి కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read:
బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది‘
బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని వస్తారు.. డబ్బు వసూలు చేసి ఉడాయిస్తారు.. ఇలాంటి వాళ్లతో తస్మాత్ జాగ్రత్త