శవం చెప్పిన నిజం.. అసలేం జరిగిందంటే!

| Edited By: Srinu

Jul 23, 2019 | 2:39 PM

ఇది ఒక కథలాంటి నిజం.. ఓ శవం చెప్పిన అసలైన నిజం. ఒక పెళ్లి చేసుకున్నవాళ్లే తప్పు చేశామని చెంపలేసుకుంటున్న ఈ రోజుల్లో అతడు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆఖరికి ప్రాణం తీసుకున్నాడు. తమిళనాడులోని ధర్మపురిలో బ్యూటీ పార్లర్లో పనిచేసే రాజా అనే వ్యక్తి ఒకరికి తెలియకుండా మరొకరిని.. అలా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ధర్మపురిలో సత్య అనే మహిళను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ధర్మపురినుంచి తేనె జిల్లాకు బదిలీపై […]

శవం చెప్పిన నిజం.. అసలేం జరిగిందంటే!
Follow us on

ఇది ఒక కథలాంటి నిజం.. ఓ శవం చెప్పిన అసలైన నిజం. ఒక పెళ్లి చేసుకున్నవాళ్లే తప్పు చేశామని చెంపలేసుకుంటున్న ఈ రోజుల్లో అతడు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆఖరికి ప్రాణం తీసుకున్నాడు.

తమిళనాడులోని ధర్మపురిలో బ్యూటీ పార్లర్లో పనిచేసే రాజా అనే వ్యక్తి ఒకరికి తెలియకుండా మరొకరిని.. అలా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ధర్మపురిలో సత్య అనే మహిళను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ధర్మపురినుంచి తేనె జిల్లాకు బదిలీపై వెళ్ళిన రాజా అక్కడ ధనలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు సంతానం. అక్కడినుంచి మధురైకి బదిలీ కావడంతో అక్కడ కావ్య అనే యువతిపై మనసు పారేసుకున్న రాజా మూడో పెళ్లి చేసుకున్నాడు.

సత్య, ధనలక్ష్మి, కావ్యలతో ఒకరికి తెలియకుండా ఒకరితో సాఫీగా రాజా జీవితం సాగిపోతుండగా.. మళ్లీ పుదుచ్చేరికి ట్రాన్స్ఫర్ అయింది. నాలుగు ఇళ్లు మెయింటెయిన్ చెయ్యడం కష్టమనుకున్నాడో ఏమో.. ఈసారి మూడో భార్య కావ్యను తనతో తీసుకెళ్ళాలనుకున్నాడు. కావ్యను తనతో పుదుచ్చేరికి రమ్మన్నాడు. ఆమె రానంది. దాంతో మనస్తాపమే చెందాడో.. మూడు ఇళ్లను మెయింటేన్ చేయడం కష్టమనుకున్నాడో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వాళ్ళు అతన్ని ఆస్పత్రికి తరలించారు.. ఫలితం లేకపోయింది. రాజా చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

రాజా కోసం ముగ్గురు భార్యలు ఆస్పత్రికి వచ్చారు. ఇంకేముంది రాజా డెడ్ బాడీ కోసం జుట్టు జుట్టు పట్టుకునేవరకూ వెళ్లారు. పోలీసులు జోక్యం చేసుకొని పెద్ద భార్యకు రాజా డెడ్ బాడీని అప్పజెప్పారు. తన భర్తకు మరో ఇద్దరు భార్యలున్నట్లు ఇప్పటివరకు తెలియదని వాపోయింది సత్య. ఏది ఏమైనా రాజా చేసిన అనాలోచిన పనికి ముగ్గురి ఆడవాళ్ల జీవితం ప్రశ్నార్ధకంగా మారింది. తమ పిల్లల పరిస్థితి ఏంటని వారు కుమిలిపోతున్నారు.