భార్యపై అలిగిన భర్త, బావిలో దూకి ఆత్మహత్య..కారణం తెలిస్తే షాకే!
భార్యపై అలిగిన భర్త మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పలాస కాశీబుగ్గ పట్టణంలోని ఓ ఆశ్రమానికి చెందిన దంపతుల ఇంట్లో ఈ విషాదం నెలకొంది.

భార్యపై అలిగిన భర్త మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పలాస కాశీబుగ్గలో పట్టణంలోని ఓ ఆశ్రమానికి చెందిన దంపతుల ఇంట్లో విషాదం నెలకొంది. భార్యను తనకు ఇష్టమైన కూర వండమని చెప్పాడు ఆ ఇంటి యజమాని. అయితే, లాక్‌డౌన్ కారణంగా దుకాణాలు తెరవనందున వండలేనని చెప్పింది అతడి భార్య. దీంతో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం గొడవకు దారితీసింది. క్షణికావేశంలో అతడు సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది గమనించిన స్థానికులు వెంటనే కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నీళ్లల్లో మునిగిపోయిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.