Hyderabad: భార్య ఫొటోలు పోర్న్ యాప్‌లో పెడతామని బెదిరింపులు.. లోన్‌ యాప్స్‌ వేధింపులు తట్టుకోలేక

|

Jul 21, 2022 | 6:41 AM

లోన్‌ యాప్‌ (Loan Apps) ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ రుగ్మతకు ప్రస్తుతం మరో ప్రాణం బలైపోయింది. అవసరానికి ఆదుకుంటుందని లోన్‌ యాప్‌ను ఆశ్రయిస్తే ఆయువునే తీసేసింది. చిటికెలో లోన్‌...

Hyderabad: భార్య ఫొటోలు పోర్న్ యాప్‌లో పెడతామని బెదిరింపులు.. లోన్‌ యాప్స్‌ వేధింపులు తట్టుకోలేక
Loan app
Follow us on

లోన్‌ యాప్‌ (Loan Apps) ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ రుగ్మతకు ప్రస్తుతం మరో ప్రాణం బలైపోయింది. అవసరానికి ఆదుకుంటుందని లోన్‌ యాప్‌ను ఆశ్రయిస్తే ఆయువునే తీసేసింది. చిటికెలో లోన్‌ అంటూ టెంప్ట్‌ చేసిన కేటుగాళ్లు, ఆ తర్వాత చేతికి నెత్తురంటకుండా చంపేశారు. గోల్డెన్‌ రూపీ యాప్‌ వేధింపులను తట్టుకోలేక ఓ వ్యక్తి సూసైడ్‌ చేసుకున్నాడు. తీసుకున్న లోన్‌ చెల్లించినా యాప్‌ యాజమాన్యం వేధింపులు ఆపకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన సుధాకర్‌ ఓ లోన్ యాప్ లో యాప్‌లో రూ.12వేలు అప్పు తీసుకున్నాడు. అసలు, వడ్డీ మొత్తం కట్టేశాడు. అయితే, అమౌంట్‌ పెండింగ్‌ ఉందంటూ యాప్‌ నిర్వాహకులు బెదిరింపులకు దిగడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

స్నేహితులు, కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పంపుతామనడంతో భయాందోళనకు లోనయ్యాడు. భార్య ఫొటోలు పోర్న్ యాప్‌లో పెడతామని బెదిరించడంతో తట్టుకోలేక రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. బంధువులు, స్నేహితులకు అసభ్యకర మెసేజ్‌లు పెట్టడంతోనే తన తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడని మృతుడి సోదరుడు వాపోయాడు. లోన్‌ మొత్తం క్లియర్‌ చేసినా యాప్‌ యజమానులు వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన చెందాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి