Crime News: జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఢీ కొట్టిన బస్సు.. 9 మందికి తీవ్రగాయాలు..

Nellore Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కావలి మద్దూరుపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దూరుపాడు

Crime News: జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఢీ కొట్టిన బస్సు.. 9 మందికి తీవ్రగాయాలు..
Crime News

Updated on: Sep 28, 2021 | 8:19 AM

Nellore Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కావలి మద్దూరుపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దూరుపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కంటైనర్ లారీని దాటుతూ ప్రైవేట్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరికొంతమందికి మందికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడన తొమ్మిది మంది క్షతగాత్రులను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే డ్రైవర్‌కు మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించినట్లు వెల్లడించారు.

ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి పాండిచ్చేరికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. తృటిలో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు.

Also Read:

Telangana: గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు..

Zojila Tunnel: నేడు జోజిలా టన్నెల్‌ను సందర్శించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. మేఘా ప్రతినిధులతో భేటీ..