Crime: ప్రార్థనలు చేస్తుండగా చెలరేగిన మంటలు.. ఘోర అగ్నిప్రమాదంలో 41మంది సజీవదహనం

|

Aug 14, 2022 | 5:30 PM

ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఊహించని విపత్తు ముంచుకొచ్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనమయ్యారు. హృదయవిదారక ఈ ఘటన ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ చర్చిలో జరిగింది....

Crime: ప్రార్థనలు చేస్తుండగా చెలరేగిన మంటలు.. ఘోర అగ్నిప్రమాదంలో 41మంది సజీవదహనం
Follow us on

ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఊహించని విపత్తు ముంచుకొచ్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనమయ్యారు. హృదయవిదారక ఈ ఘటన ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ చర్చిలో జరిగింది. కైరోలో అధిక జనసాంద్రత ఉండే చర్చిలో అగ్నిప్రమాదం సంభవించి ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా మరో14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంబాబాలోని అబూ సెఫీన్ చర్చిలో మంటలు చెలరేగాయి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్థరించారు. మంటలు ఆర్పేందుకు పదిహేను అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి పంపించారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్-సిస్సీ సంతాపం తెలిపారు. కాప్టిక్ క్రిస్టియన్ పోప్ తవాద్రోస్ II తో ఫోన్‌లో మాట్లాడారు. అగ్నిప్రమాద ఘటన మనసును కలచివేసిందని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి