Viral: ఖైదీకి ఆహారం తీసుకొచ్చిన వ్యక్తి.. లెగ్‌పీస్‌పై సన్నని దారం.. అనుమానంతో జైలు సిబ్బంది తనిఖీ చేయగా
తప్పు చేసి జైల్లోకి వెళ్లాడు. అయినా కానీ అలవాట్లు మానలేకపోయాడు. మత్తును జైల్లోకి తెప్పించేందుకు ప్రయత్నించి మరో వ్యక్తిని బుక్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
Crime News: ఇస్మార్ట్ కేటుగాళ్లు.. అస్సలు తగ్గడం లేదు. క్రైమ్ విషయంలో రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మత్తు కోసం మాయదారి ప్లాన్స్ అన్నీ వేస్తున్నారు. పుష్పకు మించిన ఎత్తులతో గంజాయిని సప్లై చేస్తూ బయటపడిన కిలాడీలను డైలీ మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా గంజాయి విపరీతంగా పట్టుబడటం ఒక రకంగా ఆందోళన కలిగిస్తుంది. యూత్ అంత దారుణ స్థాయిలో మత్తుకు అలవాటు పడ్డారా అని భయం వేస్తుంది. రోడ్డు మార్గంలో, రైలు మార్గంలో ఆఖరికి వాయు మార్గంలో సైతం మత్తు పదార్థాలను సప్లై చేస్తూ పోలీసులు చిక్కారు చాలామంది. తాజాగా ఓ వ్యక్తి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి గంజాయి(Ganja) అందించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి. కర్ణాటక(Karnataka)లోని విజయపుర(Vijayapura)లో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీకి.. కలిసేందుకు ఓ విజిటర్ వచ్చాడు. అతను.. సదరు ఖైదీకు ఇచ్చేందకు ఫుడ్ కూడా తీసుకుని వచ్చాడు. అయితే తనిఖీలు చేస్తున్న సమయంలో చికెన్ లెగ్ పీస్‌పై ఓ దారం కనిపించింది. దీంతో జైలు సిబ్బందికి అనుమానం కలిగింది. ఆ క్యారియర్ తీసుకుని తనిఖీ చేయగా లెగ్‌పీస్ లోపల దాచిన గంజాయి ప్యాకెట్ బయటపడింది. నిందితుడు లోపల చికెన్ లెగ్ బోన్‌కు గంజాయి ప్యాకెట్స్ చుట్టి పైన మళ్లీ మాంసాన్ని అతికించి దారంతో కుట్లు వేసినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిని ప్రజ్వల్ లక్ష్మణ్ ముబరుఖానేగా గుర్తించారు. అతడిని విజయపుర పోలీసులకు అప్పగించారు. 2 గ్రాముల బరువున్న 18 గంజాయి ప్యాకెట్లు అతని వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి