దారుణం, నలుగురు ఆడపిల్లల గొంతు కోసి చంపి, ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి !

హర్యానాలోని నుహ్ జిల్లాలోని ఒక గ్రామంలో శుక్రవారం దారుణం జరిగింది.  ఒకటి నుంచి ఏడేళ్ల మధ్య వయసున్న నలుగురు సోదరీమణులను...

దారుణం, నలుగురు ఆడపిల్లల గొంతు కోసి చంపి, ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి !
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 28, 2020 | 8:34 AM

హర్యానాలోని నుహ్ జిల్లాలోని ఒక గ్రామంలో శుక్రవారం దారుణం జరిగింది.  ఒకటి నుంచి ఏడేళ్ల మధ్య వయసున్న నలుగురు సోదరీమణులను గొంతుకోసి చంపినట్టు పోలీసులు గుర్తించారు.  అయితే బాలికల తల్లే  ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లల తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీవ్రగాయాలతో ఆస్పత్రి ఐసీయులో చికిత్స పొందుతోన్న బాలికల తల్లిపై కేసు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  పిప్రోలి గ్రామంలో ఈ ఘటన జరిగిందని పున్హానా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సమర్జీత్ వెల్లడించారు.

“1-7 సంవత్సరాల వయస్సు గల నలుగురు బాలికలు గొంతు కోసుకొని చంపబడ్డారు. వారి తల్లి ఈ ఘోరానికి పాల్పడిందని భావిస్తున్నాం. కూతుర్లను చంపిన అనంతరం ఆమె కూడా గొంతు కోసుకున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో నల్హార్ (నుహ్) గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఐసీయూలో చికిత్స పొందుతోంది “అని సమర్జీత్ వివరించారు. 

Also Read :

హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి బస్సులో మంటలు.. ముగ్గురు దుర్మరణం

 శ్రీవారి భక్తులకు శుభవార్త, వర్చువల్ సేవా టికెట్లు విడుదల, రోజుకు ఎన్నో తెలుసా..?