హర్యానాలో దారుణం.. నలుగురు చిన్నారుల గొంతు కోసి చంపిన తల్లి..

హర్యానాలోని గురుగ్రామ్ పరిధిలో గల నుహ్‌పిప్రోలి గ్రామంలో దారుణం వెలుగు చూసింది. నలుగురు చిన్నారులు గొంత కోయబడి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు.

హర్యానాలో దారుణం.. నలుగురు చిన్నారుల గొంతు కోసి చంపిన తల్లి..
Follow us

|

Updated on: Nov 28, 2020 | 6:32 PM

హర్యానాలోని గురుగ్రామ్ పరిధిలో గల నుహ్‌పిప్రోలి గ్రామంలో దారుణం వెలుగు చూసింది. నలుగురు చిన్నారులు గొంత కోయబడి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. వీరిని కన్నతల్లే చంపిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకెళితే.. ఖుర్షిద్ అహ్మద్, ఫర్మినా దంపతులకు 2012లో వివాహం జరిగింది. అయితే అంతకు ముందే ఫర్మినాకు మరో వ్యక్తితో పెళ్లి అయ్యింది. అతని నుండి విడిపోయి ఖుర్షిద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ముస్కాన్, అల్సిఫా, మిస్కినా అనే ఏడేళ్ల లోపు చిన్నారులతో పాటు మరో ఎనిమిది నెలల పాప కూడా ఉంది. వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. అయితే శుక్రవారం నాడు ఓ ప్రమాదంతో తమకు తెలిసిన ముగ్గురు వ్యక్తులు చనిపోతే పరామర్శించడం కోసం ఖుర్షిద్ వెళ్లాడు. తిరిగి రాత్రి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. తలుపు తట్టగా లోపలి వైపు నుండి ఎలాంటి స్పందనా రాలేదు. ఎంత పిలిచినా ఫర్మినా, పిల్లల నుండి ఉలుకు, పలుకు లేదు. లోపలివైపు తాళం వేసినట్లు ఖుర్షిద్ గమనించాడు. దీంతో కిటికీ నుంచి ఇంట్లోకి చూడగా, ఫర్మినా ఓ కత్తితో తన గొంతును కోసుకోవడాన్ని గమనించాడు. వెంటనే అతను గట్టిగా అరవడంతో చుట్టుపక్కన వారు వచ్చారు. ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే నలుగురు చిన్నారులను ఫర్మినా గొంతు కోసి చంపేసింది. రక్తపు మడుగులో వారు విగతజీవులుగా పడి ఉన్నారు. మరోవైపు ఫర్మినా సైతం తన గొంతు కోసుకునేందుకు యత్నిస్తుండటంతో ఆమె చేతిలో నుండి కత్తిని లాక్కున్నారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలను నమోదు చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. చిన్నారులను ఫర్మినా ఎందుకు చంపేసిందనే దానిపై పలు కోణాల్లో విచారిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!