Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్ లో పేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..

ముంబయిలోని భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది మృతి చెందారు

Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్  లో  పేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..

Updated on: Jan 19, 2022 | 2:40 AM

ముంబయిలోని భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది మృతి చెందారు.  మరో 11 మంది  సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ముంబయి నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  సమాచారం అందుకున్న నేవీ,  అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, అయితే పెద్దగా నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. కాగా INS రణవీర్ తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి క్రాస్ కోర్ట్  ఆపరేషన్స్ లో ఉంది.  కాసేపట్లో బేస్ పోర్ట్‌కు తిరిగి రావలసి ఉంది. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు భారత నౌకాదళం ప్రకటించింది.

 కాగా INS రణవీర్ 1986 అక్టోబర్ 28న భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ఇందులో సుమారు 310 మంది నావికులు విధులు నిర్వహిస్తున్నారు.  ఇది అధునాతన ఆయుధాలు,   సెన్సార్లతో అమర్చబడి ఉంటుంది. ఇది ఉపరితలం నుండి ఉపరితలం అదేవిధంగా ఉపరితలం నుండి గాలికి ప్రయోగించే క్షిపణులను కలిగి ఉంది. ఇది కాకుండా, ఇందులో యాంటీ మిస్సైల్ గన్‌లు, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంఛర్‌లు కూడా ఉన్నాయి.