Warangal: దూసుకొచ్చిన ఇసుక లారీ.. ముగ్గురు మహిళా కూలీల దుర్మరణం.. ఐదుగురి పరిస్థితి..

Warangal Road Accident: తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా (Hanamkonda) లోని శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం

Warangal: దూసుకొచ్చిన ఇసుక లారీ.. ముగ్గురు మహిళా కూలీల దుర్మరణం.. ఐదుగురి పరిస్థితి..
Warangal Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 08, 2022 | 8:16 AM

Warangal Road Accident: తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా (Hanamkonda) లోని శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొ్ంటున్నారు.

కాగా.. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితులు అంతా పత్తిపాక గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మిరపకాయ కోతలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మృతులు రేణుక, మంజుల, నిర్మలగా గుర్తించారు. ఉదయం కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టి పరారైనట్లు కూలీలు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో శరీర అవయవాలు తెగి రోడ్డుమీద పడ్డాయి. ఈఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

Also Read:

Hyderabad Crime: ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం.. నాలుగో అంతస్థు నుంచి దూకి రోగి ఆత్మహత్య

Telangana Schools: తెలంగాణ విద్యార్థులకు సూచన.. మరో సారి మారిన పాఠశాల సమయాలు..

రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?