Andhra Pradesh: ఆలయ చైర్మన్ కోసం 35 లక్షలు ఖర్చు పెట్టా.. ఇప్పుడు తొలగించారని మనస్తాపంతో వైసీపీ నేత ఆత్మహత్య

Andhra Pradesh: చిత్తూరు జిల్లా(Chittoor District) కుప్పం(Kuppam)లో దారుణం చోటు చేసుకుంది. తిరుపతి గంగమ్మ దేవస్థానం( Tirupati Gangamma Temple)పాలక మండలి మాజీ చైర్మన్ పార్థసారథి ఆత్మహత్య..

Andhra Pradesh: ఆలయ చైర్మన్ కోసం 35 లక్షలు ఖర్చు పెట్టా.. ఇప్పుడు తొలగించారని మనస్తాపంతో వైసీపీ నేత ఆత్మహత్య
Pardha Saradhi
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2022 | 8:29 AM

Andhra Pradesh: చిత్తూరు జిల్లా(Chittoor District) కుప్పం(Kuppam)లో దారుణం చోటు చేసుకుంది. తిరుపతి గంగమ్మ దేవస్థానం( Tirupati Gangamma Temple)పాలక మండలి మాజీ చైర్మన్ పార్థసారథి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు పార్ధసారధి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒకవైపు కొత్త చైర్మన్ మంజునాథ్ ప్రమాణ స్వీకారం ర్యాలీ జరుగుతుండగా.. మరోవైపు పార్ధసారధి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రెండేళ్ల పాటు గంగమ్మ దేవస్థానం చైర్మన్‌గా పనిచేసిన పార్థసారథి. మరోసారి తననే చైర్మన్‌గా కొనసాగిస్తారని స్థానిక నేతలు మాటిచ్చినట్టు పార్ధసారధి తన సెల్ఫీవీడియోలో చెప్పారు. కానీ మాటతప్పడమే కాకుండా.. ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి చైర్మన్ పదవి ఇవ్వడంతో మనస్థాపం చెందినట్టు తెలిపారు.

గంగమ్మ గుడికి చైర్మన్ పదవి కోసం 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలిపారాయన. కరోనా కారణంగా రెండేళ్లుగా గుడిలో జాతర కూడా జరగలేదు. ఇంకో నెలలో జాతర జరగాల్సి ఉంది. కనీసం ఆ జాతర అయ్యే వరకైనా తనను చైర్మన్‌గా ఉంచాలని కోరినా.. వినిపించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లు పార్టీ కోసం కష్టపడ్డ తనను పక్కనపెట్టి.. రెండేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చారని ఆరోపించారు. చైర్మన్ అయ్యాక అప్పులు పాలయ్యానని.. తన చావుకు ముగ్గురు విలేకరులు భాద్యులంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు పార్ధసారధి. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి.. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు పార్ధసారధి బంధువులు.

Also Read:  Guntur District: మల్లేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో అపచారం.. క్యాంటిన్‌లో మాంసాహారం కలకలం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!