AP Cabinet: గవర్నర్ దగ్గరకు మంత్రుల రాజీనామా లేఖలు.. నేడు ఆమోదించే అవకాశం..

AP cabinet Ministers resignation: ఏపీ కేబినేట్‌లోని మొత్తం 24 మంది మంత్రులు తమ ప‌ద‌వుల‌కు (AP Cabinet ministers) రాజీనామాలు చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం మ‌ధ్యాహ్నం ఏపీ స‌చివాలయంలో

AP Cabinet: గవర్నర్ దగ్గరకు మంత్రుల రాజీనామా లేఖలు.. నేడు ఆమోదించే అవకాశం..
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 08, 2022 | 11:40 AM

AP cabinet Ministers resignation: ఏపీ కేబినేట్‌లోని మొత్తం 24 మంది మంత్రులు తమ ప‌ద‌వుల‌కు (AP Cabinet ministers) రాజీనామాలు చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం మ‌ధ్యాహ్నం ఏపీ స‌చివాలయంలో జ‌రిగిన కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) ఆదేశాలకు అనుగుణంగా అంతా ఒక్కసారిగా రాజీనామాలు సమర్పించారు. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. కాగా.. మంత్రుల రాజీనామా లేఖల ఫైల్ రాజ్‌భవన్‌కు చేరింది. ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరించంద్రన్ (Biswabhusan Harichandan) రాజీనామాలు ఆమోదించనున్నారు. మంత్రులు రాజీనామాలతో పదవులు ఖాళీ అయినట్లు ఈరోజు గవర్నర్ గెజిట్ విడుదల చేసే అవకాశముంది. కాగా.. మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ వరకు మూడు రోజులపాటు సీఎం జగన్ వద్దే అన్ని ప్రభుత్వ శాఖలు ఉండనున్నాయి.

కాగా.. రాజీనామాల నేపథ్యంలో మంత్రులకు ఇచ్చిన వాహనాలను ఈరోజు ప్రోటోకాల్ అధికారులు వెనక్కి తీసుకోనున్నారు. దీంతోపాటు మంత్రుల సిబ్బంది సైతం పేషీలు ఖాళీ చేయనున్నారు. మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందికి ఈరోజు రిలీవ్ ఆర్డర్లు కూడా ఇవ్వనున్నారు. దీంతో మంత్రుల ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. మంత్రుల పేషీలకు ఉన్న నేమ్ బోర్డులు కూడా ఈరోజు తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే.. అంతకుముందు పదవీ బాధ్యతలు తీసుకున్న మంత్రులు తమకు నచ్చిన విధంగా ఛాంబర్లలో ఇంటీరియర్ చేయించుకున్న విషయం తెలిసిందే. తమకు అనుకూలంగా ఛాంబర్లను మార్పు చేసుకున్న వారిలో బొత్స, పేర్ని నాని, సుచరిత ఉన్నారు. అయితే.. పాత మంత్రులు కొత్త కేబినెట్ లోకి వచ్చినా శాఖలు మరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులందరూ రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read:

New Ministers: ఏపీ కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణలో చోటు దక్కేది ఎవరికంటే.. సామాజిక కోణంలో

APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..