Crime News: అబలలం కాదు సబలలం.. ఆకతాయి చెంప చెల్లుమనిపించిన యువతులు..
Spotboy constantly harassing: ఆడపిల్లలు, మహిళలను ఈజీగా మోసం చేయొచ్చని.. వేధించొచ్చని భావించిన ఓ ఆకతాయి భరతం పట్టారు ఇద్దరు యువతులు. వేధింపులు భరించడానికి
Spotboy constantly harassing: ఆడపిల్లలు, మహిళలను ఈజీగా మోసం చేయొచ్చని.. వేధించొచ్చని భావించిన ఓ ఆకతాయి భరతం పట్టారు ఇద్దరు యువతులు. వేధింపులు భరించడానికి మేమేం అబలలం కాదు సబలమని నిరూపించారు. ఉద్యోగాల పేరుతో వెకిలిచేష్టలకు దిగిన యువకుడి చెంపచెల్లుమనించారు. ఒకరు చెప్పుదెబ్బలతో చెలరేగిపోగా.. చేతితో చెంపలు వాయించింది మరో యువతి. ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ (bilaspur chhattisgarh) లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బిలాస్‌పూర్ టోర్వాలో నివసిస్తున్న ఓ వ్యక్తి ఉద్యోగాలిప్పిస్తానని యువతులను నమ్మించాడు. ఉద్యోగం ఆశతో అతడిని నమ్మారు ఆ యువతులు. వారి దగ్గరి ఫోన్ నంబరు తీసుకున్న యువకుడు ఉద్యోగాల విషయం పక్కనబెట్టి.. లైంగిక వేధింపులు మొదలు పెట్టాడు. వేధింపులు భరిచలేని యువతులు.. ఉద్యోగం లేకపోయినా సరే.. ఆకతాయికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అదను కోసం చూశారు.
రహదారిపై నడిచి వెళ్తున్న ఇద్దరు బాధిత యువతులకు అనుకోకుండా తారసపడ్డాడు ఆకతాయి. ఇంకేముంది.. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డుపై యువకుడి చెంపపై పెడాపెడామంటూ వాయించేశారు. ఒకరు చెప్పుతో చెలరేగి అలసిపోగా.. వెంటనే మరో యువతి రంగంలోకి దిగింది. ఈమె చెప్పుతో కాకుండా చేతితో ఆకతాయి చెంపపై విరుచుకుపడింది. మరోసారి వెకిలి చేష్టలకు దిగితే చంపేస్తాం అన్నంత కోపంతో ఊగిపోయారు యువతులు.
బిలాస్‌పూర్‌లో సినిమాలలో స్పాట్ బాయ్‌గా పనిచేస్తున్న లాల్ఖదన్ వ్యక్తి మూవీ ఇండస్ట్రీలో పని ఇప్పిస్తానంటూ యువతుల నెంబర్లు తీసుకుని వేధించేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కోని పోలీస్‌స్టేషన్ పరిధిలో జరుగినట్లు వెల్లడించారు.
Also Read: