
Road Accident in Kamareddy: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం జిల్లాలోని పిట్లం మండలం గద్దగుండు తండా వద్ద జరిగింది. 161వ జాతీయ రహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని అటుగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు.. ఘటన స్థలంలోనే మరణించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో ఇద్దరు సంగారెడ్డి జిల్లా కంగిటి మండలం బోర్గి గ్రామానికి చెందినవారు కాగా.. మరొకరు కంగిటి మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..