Adilabad Road Accident: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ ఉట్నూరు మండలం కమ్మరి తండా వద్ద జరిగింది. శుక్రవారం రాత్రి రెండు బైక్‌లు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. సమచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ యువకుడని ఆసుపత్రికి తరలించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారిని నార్నూర్ మండలం తడిహత్నూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
కాగా.. ఈ ప్రమాదంలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతూ.. పెరికగూడకు చెందిన మరో యువకుడు కూడా చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: