Jogulamba Gadwal Bus Accident: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని ఇటిక్యాల మడలం ధర్మవరం వద్ద ఆర్టీసీ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో 20మందికి గాయాలయ్యాయి. కొంతమందికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొంటున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.
Also Read: