Vizianagaram District: మైనర్లు, మహా ముదుర్లు.. మహిళలు పూలకు వెళ్లటం చూసి..

జువైనల్‌ హోమ్‌లో ఇద్దరు బాలురు ఫ్రెండ్స్ అయ్యారు. సంక్రాంతికి బయటకు వచ్చి.. సరదాగా బయట తిరిగారు. చేతిలో డబ్బులు అయిపోవడంతో.. పక్కా స్కెచ్ వేసి రంగంలోకి దిగారు.

Vizianagaram District: మైనర్లు, మహా ముదుర్లు.. మహిళలు పూలకు వెళ్లటం చూసి..
Representative image

Updated on: Jan 23, 2022 | 1:15 PM

విజయనగరం జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు మైనర్‌ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 12 తులాల గోల్డ్‌ స్వాధీనం చేసుకున్నారు. కాకినాడకు చెందిన ఓమైనర్‌ బాలుడు, విజయనగరానికి చెందిన మరో బాలుడితో కలిసి ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. ఇందులో ఓ మైనర్‌ బాలుడిపై ఏకంగా 52 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వీళ్లిద్దరూ విజయనగరం జువైనల్‌ హోమ్‌లో ఫ్రెండ్స్ అయ్యారు. సంక్రాంతికి బయటకు వచ్చి.. సరదాగా బయట తిరిగారు. చేతిలో డబ్బులు అయిపోవడంతో దొంగతనాలకు ప్లాన్ వేశారు.

విజయనగరం జిల్లా పులిగెడ్డవారి వీధిలో తెల్లవారుజామునే మహిళలు తోటలలో పూలు కోసేందుకు వెళ్తుంటారు..ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన ఇద్దరు మైనర్‌ దొంగలు…. వారు ఇంటి నుంచి బయటకు వెళ్లగానే ఇళ్లలోకి చోరబడి బంగారం ఎత్తుకెళ్లారు. ఇంటికి వచ్చిన మహిళలు.. బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు మైనర్లను విచారించారు. వారు చేసిన నేరాలను ఒప్పుకోవడంతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.

Also Read: విషాదం.. బైక్‌పై వెళ్తుండగా, తల్లి చేతుల్లో నుంచి జారిపడ్డ 3 నెలల పసివాడు.. చక్రంలో ఇరుక్కుని

పైనుంచి చూస్తే అల్లం లోడే… లోపల చెక్ చేసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది