AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: నిద్రిస్తున్న తల్లిని బాయ్​ఫ్రెండ్‌తో కలిసి హత్య చేసిన కుమార్తె.. కారణం తెలిస్తే కంగుతింటారు

తమిళనాడు తూత్తుకుడిలో  దారుణం జరిగింది. బాయ్​ఫ్రెండ్​తో కలిసి కని.. పెంచి పోషించిన తల్లిని అంతమొందించింది ఓ కూతురు.

Crime: నిద్రిస్తున్న తల్లిని బాయ్​ఫ్రెండ్‌తో కలిసి హత్య చేసిన కుమార్తె.. కారణం తెలిస్తే కంగుతింటారు
Woman Murder
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 29, 2022 | 3:49 PM

Share

Tamil Nadu: తమిళనాడు తూత్తుకుడి(Thoothukudi)లో  దారుణం జరిగింది. బాయ్​ఫ్రెండ్​తో కలిసి కని.. పెంచి పోషించిన తల్లిని అంతమొందించింది ఓ కూతురు. తల్లి నిద్రలో ఉండగా.. అత్యంత పాశవికంగా దాడి చేసి చంపేసింది. వివరాల్లోకి వెళ్తే..  మునియలక్ష్మి అనే మహిళ.. మనస్పర్థల నేపథ్యంలో తన భర్తకు దూరంగా ఉంటోంది. నలుగురు పిల్లలతో కలిసి ట్యూటికోరన్​లో జీవనం సాగిస్తోంది. కుటుంబ పోషణ కోసం స్థానిక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తాత్కాలిక క్లీనర్​గా వర్క్ చేస్తుంది. కాగా మహిళ పెద్ద కూతురు(17) పాలిటెక్నిక్ మధ్యలోనే ఆపేసింది. స్థానికంగా చాలా మంది యువకులతో యువతి ఫ్రెండ్షిప్ చేసేది. కూతురి ప్రవర్తనపై పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసింద తల్లి. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించింది ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆంక్షలు పెట్టింది. దీంతో తల్లిపై విపరీతమైన కోపం పెంచుకుంది. ఈ క్రమంలోనే ఓ బాయ్​ఫ్రెండ్​తో కలిసి సోమవారం తల్లిపై దాడి చేసింది. తల్లి నిద్రిస్తున్న సమయంలోనే దారుణంగా చంపేసింది. సమాచారం అందుకొని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో తల్లిని తానే హత్య చేసినట్లు యువతి ఒప్పుకుంది. అయితే, ఆ యువతి చెప్పిన మరో వెర్షన్ విని పోలీసులు కంగుతిన్నారు. వ్యభిచారం చేయాలని తనపై తల్లి ఒత్తిడి చేసిందని పోలీసులతో చెప్పింది యువతి. అందుకే మర్డర్ చేసినట్లు వెల్లడించింది తెలిపింది. దీంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Also Read: Telangana: పరిగిలో బాలిక అత్యాచార, హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. పక్కా స్కెచ్

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి