యాదాద్రిలో తొలి దర్శనం చేసుకున్న ఆలయ సిబ్బంది

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సర్వదర్శనాలు ప్రారంభమయ్యాయి. తిరుమల తరహాలో తొలి రోజు ట్రయల్ రన్‌ నిర్వహిస్తున్నారు.

యాదాద్రిలో తొలి దర్శనం చేసుకున్న ఆలయ సిబ్బంది
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 08, 2020 | 10:07 AM

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సర్వదర్శనాలు మొదలయ్యాయి. తిరుమల తరహాలో తొలి రోజు ట్రయల్ రన్‌ నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులకు ఈ రోజు అవకాశం కల్పిస్తున్నారు. రేపటి నుంచి భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం సిబ్భంది. మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేశారు. లడ్డు ప్రసాద కౌంటర్ల వద్ద తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయంలోపల తీర్థ ప్రసాదాలను నిషేధించారు. దేవస్థానం అనుమతించే వరకు చిన్నపిల్లలు, వ‌ృద్ధులు దర్శనాలకు రావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే, ఆలయానికి చేరుకొనేందుకు కొన్ని ఆంక్షలు విధించారు. కొండ కింది నుంచి భక్తులు కాలినడకనే ఆలయానికి చేరుకోవాలని నిబంధన విధించారు. కొండపైకి ఏ వాహనాలకు అనుమతివ్వబోరని అధికారులు వెల్లడించారు.

లాక్‌డౌన్‌కు ముందు యాదాద్రి కొండపై సత్యనారాయణ స్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్‌కు ఒక హాల్‌లో 250 జంటలు పూజకు కూర్చునేలా అనుమతించేవారు. కానీ, ప్రస్తుతం ఒక్కో బ్యాచ్‌‌కు 50 మంది దంపతులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..