Corona Lambda: క‌ల‌వ‌ర‌పెడుతోన్న క‌రోనా కొత్త‌ వేరియంట్ ‘లాంబ్డా’.. హెచ్చ‌రిస్తోన్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌..

|

Jun 28, 2021 | 10:43 AM

Corona Lambda: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వాళిని ఇప్ప‌ట్లో వదిలేలా క‌నిపించ‌డ‌లేదు. తొలి వేవ్ త‌గ్గిన త‌ర్వాత అంతా ఊపిరి పీలుచుకుంటోన్న స‌మ‌యంలోనే రెండో వేవ్ బీభ‌త్సం సృష్టించింది. మ‌రీ ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ భార‌త‌దేశాన్ని...

Corona Lambda: క‌ల‌వ‌ర‌పెడుతోన్న క‌రోనా కొత్త‌ వేరియంట్ ‘లాంబ్డా’.. హెచ్చ‌రిస్తోన్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌..
Corona
Follow us on

Corona Lambda: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వాళిని ఇప్ప‌ట్లో వదిలేలా క‌నిపించ‌డ‌లేదు. తొలి వేవ్ త‌గ్గిన త‌ర్వాత అంతా ఊపిరి పీలుచుకుంటోన్న స‌మ‌యంలోనే రెండో వేవ్ బీభ‌త్సం సృష్టించింది. మ‌రీ ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ భార‌త‌దేశాన్ని గ‌డ‌గ‌డలాడించింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు కాస్త మెరుగు ప‌డుతున్నాయ‌ని సంతోషించే లోపే మ‌రో పెను ముప్పు ముంచుకొస్తుంద‌న్న వార్త‌లు అంద‌రినీ భ‌య‌పెట్టిస్తున్నాయి. ప్ర‌స్తుతం కరోనా వైర‌స్‌లో కొత్త‌గా ‘లాంబ్డా’ అనే వేరియంట్‌ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
ప్ర‌స్తుతం అనేక దేశాల్లో విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని ‘దృష్టిసారించాల్సిన వైరస్‌ రకం’ (వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌)గా ప్రకటించింది. ఈ కొత్త ర‌కం వైర‌స్ తొలుత గ‌తేడాది ఆగ‌స్టులోనే పెరూలో వెలుగులోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత 29 దేశాల‌కు విస్త‌రించింది. బ్రిట‌న్‌లోని ప‌బ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ కొత్త ర‌కం వేరియంట్‌పై ప‌రిశోధ‌నలు చేస్తోంది. ఈ వేరియంట్ వ‌ల్ల మున‌పటి వైర‌స్ కంటే ఎక్కువ ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తుంద‌న‌డానికి కానీ.. ప్ర‌స్తుత టీకాల‌ను ఈ వైర‌స్ త‌ట్టుకోల‌గ‌ద‌ని చెప్ప‌డానికి ఎలాంటి ఆధారాలు లేవ‌ని తెలిపింది. అయితే ఈ వైర‌స్ ఉద్ధృతంగా వ్యాపించే ప్ర‌మాదం ఉంద‌న్న ఆందోళ‌న‌లు మాత్రం వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ కొత్త ర‌కం వైర‌స్ గురించి పూర్తిగా తెలుసుకునే క్ర‌మంలో ల్యాబ్‌ల్లో మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ప‌బ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ తెలిపింది.

Also Read: తొలకరి వచ్చింది.. వజ్రం దొరికింది.. జొన్నగిరి కూలిని లక్షాధికారిని చేసింది..

T.Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ మంటలు.. నిప్పులు చెరుగుతున్న సీనియర్ నేతలు

PAN Aadhaar: ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసిన ఎస్‌బీఐ.. ఆధార్‌-పాన్ లింక్ చేసుకోవాలని సూచ‌న‌.. లింక్ అయిందో లేదో ఇలా.