విధాన స‌భ‌లో క‌రోనా క‌ల‌క‌లం..మ‌హిళా ఉద్యోగికి పాజిటివ్‌

|

Jun 16, 2020 | 10:25 PM

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. ప్ర‌జాప్ర‌తినిధులు, సామాజిక వేత్త‌లు, సినీ సెల‌బ్రిటీలు ఇలా ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌కుండా ప‌ట్టి పీడిస్తోంది. ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో ఉన్న‌త అధికారులు, సిబ్బంది కోవిడ్ కోర‌ల్లో చిక్కుకున్నారు. కాగా, తాజాగా,..

విధాన స‌భ‌లో క‌రోనా క‌ల‌క‌లం..మ‌హిళా ఉద్యోగికి పాజిటివ్‌
Follow us on
దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. ప్ర‌జాప్ర‌తినిధులు, సామాజిక వేత్త‌లు, సినీ సెల‌బ్రిటీలు ఇలా ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌కుండా ప‌ట్టి పీడిస్తోంది.  ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో ఉన్న‌త అధికారులు, సిబ్బంది కోవిడ్ కోర‌ల్లో చిక్కుకున్నారు. కాగా, తాజాగా, కర్ణాటక విధాన సభలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. పౌరసరఫరాలశాఖకు చెందిన మహిళా ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.  దీంతో విధాన సభ భవనంలోని ఆ శాఖకు సంబంధించిన ఐదుగదులను అధికారులు సీజ్ చేశారు. కార్యాల‌యాన్ని పూర్తిగా సానిటైజ్ చేశారు. ఈ విషయాన్ని సీఎంవో కార్యాల‌యం కూడా ధ్రువీకరించింది.
ఇదిలా ఉంటే, కర్ణాటకలో ఇవాళ ఒక్కరోజే 317 కేసులు నమోదవ్వగా..ఏడుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కర్ణాటకలో నమోదైన కేసుల సంఖ్య 7,530కి చేరింది. కరోనాకు బలైన వారి సంఖ్య 94కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,976 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 72 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.