ఆషికా అందాల సెగలు.. కుర్రకారు తట్టుకోవడం కష్టమే!

Samatha

28 May 2026

అందాల చిన్నది కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఆషికా

ఈ బ్యూటీ 2016లో క్రేజీ బాయ్స్ అనే సినిమాతో కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

క్రేజీ బాయిస్

ఈ మూవీతో మంచి ఫేమ్ రావడంతో, టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ మూవీతో డెబ్యూ చేసింది.

అమిగోస్

ఈ సినిమాలో తన అందం, అభినయంతోనే కాకుండా, తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచుకొని, టాలీవుడ్ అభిమానుల్లో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

అందం, అభినయం

ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు వరసగా సినిమాలు చేసింది. ముఖ్యంగా, నాగశౌర్య రంగబలి, నవీన్ పొలిశెట్టి సరసన మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

వరస సినిమాలు

ఇవే కాకుండా కన్నడలో కూడా ఈ అమ్మడు వరసగా పలు సినిమాలు చేసింది, రాంబో 2, రాయమ్మ, మదగజ వంటి హిట్ సినిమాల్లో నటించి, తన నటన, డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది.

కన్నడ సినిమాలు

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో కూడా వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నట్లు టాక్. ఇక ఎంత బిజీగా ఉన్నా, ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

నెట్టింట్ యాక్టివ్

తన క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరి మనసు దోచేసుకుంటుంది. తాజాగా ఈ చిన్నది స్టైలిష్ లుక్‌లో అందంగా రెడీ అయిన ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఫొటోస్ వైరల్