రోహిణి కార్తె.. రోళ్లు పగిలే ఎండల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

28 May 2026

Rajashekher

కార్తె అంటే ఏమిటి?.. భారతీయ జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక నక్షత్రంలో సంచరించే సుమారు 13–15 రోజుల కాలాన్ని కార్తె అంటారు. మొత్తం 27 నక్షత్రాలకు అనుగుణంగా ఏడాదిలో 27 కార్తెలు ఉంటాయి.

కార్తెలు ఎలా ఏర్పడతాయి?.. సూర్యుడు ఏ నక్షత్రంలోకి ప్రవేశిస్తే ఆ నక్షత్రం పేరుతో కార్తె ఏర్పడుతుంది. ఉదాహరణకు సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తే దానిని రోహిణి కార్తె అంటారు.

కార్తెలు – వాతావరణ సంబంధం.. పూర్వకాలంలో రైతులు కార్తెల ఆధారంగానే వర్షాలు, ఎండలు, గాలులను అంచనా వేసి వ్యవసాయం చేసేవారు. వాతావరణ మార్పులు ఎక్కువగా కార్తెలకు అనుగుణంగా ఉంటాయని పెద్దలు విశ్వసించేవారు.

రోహిణి కార్తె ప్రత్యేకత.. రోహిణి కార్తెను సంవత్సరంలో అత్యంత వేడి కాలంగా భావిస్తారు. ఈ సమయంలో తీవ్రమైన ఎండలు, వడగాలులు, ఉక్కపోత ఎక్కువగా ఉంటాయి.

ఈ ఏడాది రోహిణి కార్తె తేదీలు.. ఈ సంవత్సరం రోహిణి కార్తె మే 25 నుంచి జూన్ 7 వరకు కొనసాగుతుంది. అనంతరం జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది.

రోహిణి కార్తెలో ఎండలు ఎందుకు ఎక్కువ?.. ఈ సమయంలో సూర్యకిరణాలు భూమిపై నిటారుగా పడటంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. అందుకే “రోహిణిలో రోళ్లు పగులుతాయి” అనే సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది.

వ్యవసాయ ప్రాముఖ్యత.. వర్షాకాలానికి ముందు భూమిని సిద్ధం చేయడం, కొన్ని రకాల వరి నార్లు పోయడం వంటి పనులకు రోహిణి కార్తెను రైతులు ముఖ్యమైన సమయంగా భావిస్తారు.

పురాణ విశ్వాసాలు... విష్ణు పురాణం ప్రకారం రోహిణి కార్తె వేడిని సహించడం పుణ్యప్రదమని, ఈ సమయంలో సూర్యారాధన చేయడం వల్ల దైవానుగ్రహం లభిస్తుందని విశ్వాసం.