మామిడి పండ్లు తినేటప్పుడు ఈ పొరపాట్లు చేయొద్దు

28 May 2026

TV9 Telugu

TV9 Telugu

మామిడిపండ్ల తీపి రుచి, మైమరిపించే సువాసన మనల్ని పిచ్చెక్కిస్తుంది. అందుకే మామిడి ప్రియులు వేసవి కాలం కోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. అయితే మామిడి పండ్లను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా?

TV9 Telugu

ఒక కప్పు మామిడి ముక్కల్లో సుమారు 99 క్యాలరీలు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.6 గ్రాముల ఫైబర్‌తో పాటు విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి

TV9 Telugu

అందుకే మామిడి కేవలం తీపి పండు మాత్రమే కాకుండా శరీరానికి ఉపయోగపడే పోషకాల నిధిగా కూడా చెప్పవచ్చు. అయితే ఇందులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటంతో మోతాదు నియంత్రణ చాలా ముఖ్యం

TV9 Telugu

మామిడిని ఒంటరిగా తినడం కంటే ప్రోటీన్ లేదా మంచి కొవ్వు పదార్థాలతో కలిపి తింటే మరింత సమతుల్యమైన ఆహారంగా మారుతుంది. గ్రీక్ యోగర్ట్, డ్రైఫ్రూట్స్, పనీర్, గుడ్లు వంటి వాటితో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది

TV9 Telugu

అయితే మామిడి అందరికీ సరిపోదు. మామిడిపండు అల‌ర్జీ ఉన్నవారు దీనిని పూర్తిగా దూరంగా ఉంచాలి. పాయిజన్ ఐవీ, ఓక్ వంటి మొక్కలకు అల‌ర్జీ ఉన్నవారిలో మామిడి తొక్క లేదా రసం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది

TV9 Telugu

అలాగే ఐబీఎస్ లేదా ఫాడ్‌మాప్ సెన్సిటివిటీ ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు కనిపిస్తాయి. సరైన మోతాదులో ప్రతిరోజూ మామిడి తినడం వల్ల శరీరానికి విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి

TV9 Telugu

ఇది జీర్ణక్రియ, తృప్తి భావం, మొత్తం పోషకాహార నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కానీ మోతాదు మించితే ప్రయోజనాల కంటే ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది

TV9 Telugu

అయితే మితిమీరిన మోతాదులో తింటే కొంతమందిలో చక్కెర ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి