కరోనా రాకుండా ఈ టిప్స్ ఫాలోకండి..!! మీ దగ్గరికి రాలేదిక..!

కరోనా.. మొన్నటి వరకు ప్రపంచంలోని కొన్ని దేశాలనే వణికించిన ఈ వైరస్.. ఇప్పుడు మన దేశాన్ని కూడా వణికిస్తోంది. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయన్న వార్తలు..

కరోనా రాకుండా ఈ టిప్స్ ఫాలోకండి..!! మీ దగ్గరికి రాలేదిక..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 04, 2020 | 9:02 PM

కరోనా.. మొన్నటి వరకు ప్రపంచంలోని కొన్ని దేశాలనే వణికించిన ఈ వైరస్.. ఇప్పుడు మన దేశాన్ని కూడా వణికిస్తోంది. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయన్న వార్తలు.. ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. అయితే ఈ కరోనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే.. ఎంతో మంచిది.

కరోనా లక్షణాలు..

కరోనా వ్యాధి బారిన పడితే.. ప్రాణాలు దక్కడమనేది.. చాలా అరుదు. ఎందుకంటే ఇప్పటి వరకు మూడు వేలమందికి పైగా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం.

ఈ కరోనా వైరస్ బారిన పడిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. అంతేకాదు గొంతు కాస్త మంటగా ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ తలనొప్పి, జ్వరం, దగ్గు మొదలవుతాయి. క్రమక్రమంగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అయితే ఇలాంటి లక్షణాలు అనిపిస్తే.. వెంటనే స్థానిక ఆస్పత్రికి వెళ్లి.. పరీక్షలు చేయించుకోవాలి.

ఈ కరోనా వ్యాప్తి చెందేది ఎలా..?

ఈ కరోనా వైరస్.. ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి.. తుమ్మినా, దగ్గినా.. పక్కన ఉన్న వ్యక్తులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అదేవిధంగా ఈ వైరస్ బారిన పడిన వ్యక్తిని టచ్ చేసినా.. కరచలనం చేసినా.. ఇతరులకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఈ వైరస్ బారిన పడ్డ వ్యక్తులు ముట్టుకున్న వస్తువుల్ని మరేదైనా కానీ ముట్టుకుంటే.. అక్కడి నుంచి వైరస్ క్రమంగా ఇతరుల శరీరంపై ఎటాక్ చేస్తుంది. అంతేకాదు.. క్రమంగా అవి నోట్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. దీంతో ఈ వైరస్ వ్యాపించినట్లే అవుతుంది. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది.

వైరస్ రాకుండా టిప్స్..

ప్రస్తుతం ఈ కరోనా వైరస్‌కు మందు లేదు. ఈ వ్యాధి రాకుండా నివారణ ఒక్కటే మార్గం. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే.. క్రమంతప్పకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని చేతులతో టచ్ చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కరోనా అనుమానితులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇక దగ్గు, జ్వరం లాంటివి వస్తే.. బయట తిరగడం మానేయాలి. ఎక్కువ నీరు తాగుతూ.. రెండు రోజుల పాటు గమనించాలి. అప్పటికీ జ్వరం, దగ్గు తగ్గకపోతే.. ఎవర్నీ దగ్గరకు రానీయకుండా.. వైద్యుడిని సంప్రదించాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu